మెగాస్టార్ చిరంజీవితో తమిళ స్టార్ దర్శకుడు శంకర్ కలిసి పనిచేయనున్నారనే వార్త జోరుగా వినిపిస్తోంది. రీఎంట్రీ తర్వాత వరుస ప్రాజెక్టులు చేస్తున్న చిరు.. ప్రస్తుతం కొరటాల శివ తీస్తున్న 'ఆచార్య'లో నటిస్తున్నారు. మరోవైపు 'లూసిఫర్' రీమేక్ కోసం సిద్ధమవుతున్నారు. వీటితోపాటే కొందరు యువ దర్శకులతో కథాచర్చల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే శంకర్‌తో పనిచేసేందుకు ఉత్సాహం చూపుతున్నారని టాక్.
ఇటీవలే వీరిద్దరి మధ్య చర్చలు సాగాయని, శంకర్ ఓ సందేశాత్మక కథ చెప్పారని సమాచారం. దీనికి చిరు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చే అవకాశముందట. త్వరలో ఈ విషయంపై స్పష్టత రానుంది. అయితే ప్రస్తుతం కమల్ హాసన్‌తో 'భారతీయుడు 2' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు శంకర్.