ETV Bharat / sitara

Chiranjeevi birthday: ఆ ఘనత సాధించిన తొలి దక్షిణాది స్టార్ చిరునే!​ - చిరంజీవి మూవీ న్యూస్

మెగాస్టార్ చిరంజీవి అనగానే అద్భుతమైన సినిమాలు, అబ్బురపరిచే డ్యాన్సులు, విజిల్స్ కొట్టించే ఫైట్లు.. ఇలా మనకు చాలా గుర్తొస్తాయి. కానీ ఆయన జీవితంలో ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు ఉన్నాయి. ఇంతకీ అవేంటి? వాటి సంగతేంటి? ఆదివారం మెగాస్టార్​ 67వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో ప్రత్యేక కథనం.

chiranjeevi
చిరు
author img

By

Published : Aug 22, 2021, 5:31 AM IST

కొణిదెల శివ శంకర వరప్రసాద్​ మధ్యతరగతి యువకుడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​లోని నర్సాపుర్​లో డిగ్రీ పూర్తి చేసిన తర్వాత నటుడు అవుదామనే కోరికతో మద్రాస్​ ఫిల్మ్ ఇన్​స్టిట్యూట్​లో 1976లో చేరాడు. ఆ రంగుల ప్రపంచంలో అందరిలానే కష్టాలు ఎదుర్కొన్నప్పటికీ, వాటినే తన విజయ సోపానాలుగా మార్చుకున్నాడు. ఒక్కో మెట్టు ఎక్కుతూ, తన చుట్టూ ఉండే వాళ్లను ఆశ్చర్యపరుస్తూ మెగాస్టార్ చిరంజీవిగా ఎదిగారు. ఇప్పుడు ఇలా మన ముందున్నారు. ఆయన 67వ పుట్టినరోజు సందర్భంగా 'ఈటీవీ భారత్'​ అందిస్తున్న ప్రత్యేక కథనం.

డ్యాన్స్​కు కేరాఫ్

టాలీవుడ్​ డ్యాన్స్​కు పర్యాయపదం చిరు. ఫోక్, బ్రేక్, క్లాసికల్, డిస్కో.. ఇలా ఒకటేమిటి ఎందులో అయినా సరే తన మార్క్​ సృష్టించి, అభిమానుల్ని ఉర్రూతలూగించారు. ఇప్పటికీ ఎంతోమందికి అభిమాన కథానాయకుడిగా కొనసాగుతున్నారు.

chiranjeevi
చిరంజీవి

చిరు సినిమాతోనే రూ.10 కోట్లు కలెక్షన్

చిరంజీవి 'ఘరానా మొగుడు'(1992).. రూ.10 కోట్ల కలెక్షన్ సాధించిన తొలి తెలుగు సినిమా. తర్వాతి ఏడాది అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్​ ఆఫ్ ఇండియాలోనూ ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. 1986లో కన్నడలో వచ్చిన 'అనురాగ అరలితు'కు ఇది రీమేక్. నగ్మా, వాణీ విశ్వనాథ్ హీరోయిన్లు. కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు.

ఆస్కార్​కు ఆహ్వానం

లాస్ ఏంజెల్స్​లో 1987లో జరిగిన 59వ ఆస్కార్​ అవార్డుల కార్యక్రమానికి చిరును ఆహ్వానించారు. దీంతో దక్షిణాది నుంచి ఈ ఘనత సాధించిన తొలి నటుడిగా ఆయన రికార్డు సృష్టించారు.

chiranjeevi
చిరంజీవి

రెమ్యునరేషన్​లో టాప్

'ఇంద్ర'(2001) సినిమా కోసం రూ.7 కోట్లు రెమ్యునరేషన్​ తీసుకున్న మెగాస్టార్.. అప్పట్లో 'లగాన్' కోసం రూ.6 కోట్లు అందుకున్న ఆమిర్​ను అధిగమించారు.

రష్యన్​లో చిరు 'స్వయంకృషి'

చిరు నటించిన ప్రయోగాత్మక చిత్రం 'స్వయంకృషి'. ఇందులో ఆయన చెప్పులు కుట్టేవాడి పాత్రలో నటించారు. దిగ్గజ కె.విశ్వనాథ్​ దర్శకత్వం వహించిన ఈ సినిమాను.. రష్యన్​ డబ్ చేయడమే కాకుండా మాస్కో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్​లో ప్రత్యేక ప్రదర్శన కూడా వేశారు. ఇంటర్నేషనల్​ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్, ఆసియా పసిఫిక్ ఫిల్మ్ ఫెస్టివల్​లోనూ 'స్వయంకృషి'ని ప్రదర్శించడం విశేషం.

chiranjeevi
చిరంజీవి

అమితాబ్ కంటే ఎక్కువ రెమ్యునరేషన్

'ఆపద్బాంధవుడు'(1992) కోసం మెగాస్టార్ రూ.1.25 కోట్లు తీసుకున్నారు. అయితే ఆ సమయంలో అది అమితాబ్​ బచ్చన్​కు ఇచ్చే రెమ్యునరేషన్​ కంటే ఎక్కువని కొన్ని మ్యాగజైన్లు ప్రచురించాయి. ఇదే నిజమైతే మాత్రం అప్పట్లో దేశంలోనే ఎక్కువ రెమ్యునరేషన్​ తీసుకున్న రికార్డు చిరుదే.

chiranjeevi
చిరంజీవి

హాలీవుడ్​లో వచ్చి చేజారిన అవకాశం

ఓ ప్రముఖ వార్తా సంస్థ కథనం ప్రకారం 90వ దశకంలో(1990-99) ఎక్కువ మందిని ప్రభావితం చేసిన టాప్-10 వ్యక్తుల్లో చిరు స్థానం సంపాదించారు. ఆ టైమ్​లోనే హాలీవుడ్​లో నటించే అవకాశం మెగాస్టార్​కు వచ్చింది. 'ద రిటర్న్ ఆఫ్ ద థీప్​ ఆఫ్ బాగ్దాద్' పేరుతో రూపొందించారు. కానీ కొన్ని కారణాల వల్ల అది మధ్యలోనే ఆగిపోయింది.

కమల్+రజనీ= చిరు

దిగ్గజ నటులు రజనీకాంత్, కమల్​హాసన్​లను కలిపితే మెగాస్టార్ చిరంజీవి అని దిగ్గజ దర్శకుడు బాలచందర్ ఓ సందర్భంలో వ్యాఖ్యానించారు. యాక్షన్ సన్నివేశాలు చేయడమే కాకుండా చిరు అద్భుతంగా నటించగలరని పేర్కొన్నారు.

chiranjeevi
కమల్​ రజనీతో

మెగా ఫ్యామిలీ హీరోల అడ్డా

మెగాస్టార్ తర్వాత తన కుటుంబం నుంచి చాలామంది నటులు వచ్చారు. పవన్​కల్యాణ్, నాగబాబు, రామ్​చరణ్, అల్లు అర్జున్, వరుణ్​తేజ్, సాయిధరమ్ తేజ్, అల్లు శిరీష్, కల్యాణ్​దేవ్, వైష్ణవ్​తేజ్, నిహారిక.. తమ తమ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.

chiranjeevi
కుటుంబంతో

చిరు రాజకీయ ప్రస్థానం

2009లో ప్రజారాజ్యం స్థాపించిన చిరు.. ఆ తర్వాత కాంగ్రెస్ హయాంలో కేంద్ర సహాయమంత్రిగా పనిచేశారు. దాదాపు పదేళ్లపాటు పొలిటిక్స్​లో కొనసాగిన మెగాస్టార్.. 2019లో వచ్చిన 'ఖైదీ నం.150'తో టాలీవుడ్​లోకి రీఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత 'సైరా' మెప్పించిన ఆయన.. ప్రస్తుతం 'ఆచార్య' చేస్తున్నారు. ఆ తర్వాత మోహన్​రాజా, మెహర్​ రమేశ్, బాబీ డైరెక్షన్​లో వరుసగా సినిమాలు చేయనున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.