ETV Bharat / sitara

ఆ పండగ రేసులో చిరంజీవి 'ఆచార్య'! - చిరంజీవి ఆచార్య దీపావళికి

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ తెరకెక్కించిన చిత్రం 'ఆచార్య'. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ రిలీజ్ డేట్​పై ఇప్పటికీ సందిగ్ధత వీడలేదు. తాజాగా ఈ సినిమా విడుదలకు సంబంధించి మరో వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది.

Chiranjeevi
చిరంజీవి
author img

By

Published : Sep 1, 2021, 6:25 PM IST

తెలుగు చిత్రపరిశ్రమే కాదు, సినీ అభిమానులూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం 'ఆచార్య'. చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్‌ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. వేసవి కానుకగా థియేటర్‌లలో అలరించాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా చిత్రీకరణ ఆలస్యమవడం వల్ల విడుదల వాయిదా పడింది. దీంతో వీలైనంత త్వరగా షూటింగ్‌ పూర్తి చేసి, దసరా కానుకగా తీసుకువస్తారని అందరూ అనుకున్నారు.

కానీ, ప్రస్తుతం పరిస్థితులు పూర్తి సానుకూలంగా లేకపోవడం, నిర్మాణానంతర కార్యక్రమాలు ఇంకా పూర్తి కాకపోవడం వల్ల ఇంకొంత ఆలస్యం కానున్నట్లు టాలీవుడ్‌ టాక్‌. మరోవైపు దసరాకు వచ్చే చిత్రాలు ఇప్పటికే బెర్తులు ఖరారు చేసుకున్నాయి. దీంతో 'ఆచార్య' చూపు దీపావళివైపు అంటున్నారు తెలుగు సినీ పరిశ్రమ వర్గాలు. నవంబర్ 4న ఈ మూవీని రిలీజ్ చేయబోతున్నారట. త్వరలోనే విడుదల తేదీకి సంబంధించి పూర్తి స్పష్టత రావొచ్చు.

కాజల్‌ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో రామ్‌చరణ్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. పూజా హెగ్డే తళుక్కున మెరవనుంది. మణిశర్మ స్వరాలు సమకూరుస్తున్న 'ఆచార్య'ను మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై నిరంజన్‌రెడ్డి, రామ్‌చరణ్‌ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన టీజర్‌ సినిమాపై అంచనాలను పెంచుతోంది.

ఇవీ చూడండి: పవన్ మెచ్చిన పుస్తకాలు ఇవే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.