మెగా అల్లుడు కల్యాణ్ దేవ్.. పులివాసు అనే నూతన దర్శకుడితో ప్రస్తుతం ఓ చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా ఏ దశలో ఉందో ఇంత వరకు తెలియలేదు. తాజాగా కల్యాణ్ మరో కొత్త దర్శకుడితో పనిచేసేందుకు సిద్ధమవుతున్నాడు. సాయి కిషోర్ మచ్చ అనే యువ దర్శకుడు ఓ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ కథతో కల్యాణ్‌ను మెప్పించాడట.
మెగాస్టార్ ఆమోదం..
కల్యాణ్ నటించనున్న ఈ చిత్రానికి చిరంజీవి ఆమోదముద్ర వేశాడట. తన అల్లుడికి ఈ సినిమా మంచి పేరు తెస్తుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నాడట మెగాస్టార్. ఓ స్ర్పింటర్ నిజ జీవితాధారంగా ఈ చిత్రం తెరకెక్కనుందట. ఈ పాత్ర కోసం కల్యాణ్ తన బాడీని ప్రొఫెషనల్ అథ్లెట్‌లా మార్చుకునేందుకు సిద్ధమవుతున్నాడని సమాచారం. ఇప్పటికే ఇందుకోసం కసరత్తులు ప్రారంభించాడటీ హీరో.
ఇదీ చదవండి: 'పవన్ కల్యాణ్.. ఆ రోజు తిట్టి భోజనం పెట్టారు'