లాక్‌డౌన్ సమయంలో చాలామంది సినీతారలు తమకు ఇష్టమైన వ్యాపకాలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. వాళ్ల అభిరుచులను అభిమానులతో పంచుకుంటూ మరింత దగ్గరయ్యారు. లాక్‌డౌన్ సమయంలోనే మెగాస్టార్ చిరంజీవి కూడా ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ ఖాతాలను తెరిచారు. అప్పటి నుంచి అభిమానులకు కొత్త సంగతులు చెప్తూ అలరిస్తున్నారు. తాజాగా తన ఇంటి వద్ద పూసిన మందార మకరందాలను అందంగా ఫొటోలు తీశారు చిరు. అంతేనా వాటిపై సరికొత్తగా కవిత కూడా అల్లారు.
"ప్రభాత సౌందర్యాన్ని వొడిసి పట్టుకుని, మా ఇంటి మందారం తన కొప్పుని సింగారించింది.. అలవోకగా నా కెమెరా కంటికి చిక్కి అంతర్జాలానికి తన అందం తెలిసింది !.." అంటూ తనలోని ప్రకృతి కవిని మనకు పరిచయం చేశారు చిరంజీవి.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' చిత్రం చేస్తున్నారు చిరు. కాజల్ కథానాయక. త్వరలోనే తిరిగి షూటింగ్ ప్రారంభం కానుంది.