ఆర్థిక సమస్యలు, ప్రేమ విఫలం, ఒత్తిడి, మోసాలు, విరక్తి వంటి తాత్కాలిక సమస్యల్ని ఎదుర్కోలేక చిన్న వయసులోనే తనువు చాలించిన తారలు కొందరైతే.. అనారోగ్య కారణంతో ఆకస్మికంగా మృతి చెందినవారు సినీ ప్రముఖులు మరికొందరు. ఈ జాబితాలో నాటి సిల్క్‌స్మిత, సావిత్రి నుంచి నేటి బాలీవుడ్ నటులు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, సిదార్థ్ శుక్లా వరకు ఉన్నారు
సిద్దార్థ్ శుక్లా
మోడల్‌గా పరిచయమైన సిద్దార్థ్ (sidharth shukla).. 40 ఏళ్లకే మరణించాడు. ఇతడు గుండెపోటుతో చనిపోయాడు! బుల్లితెర సీరియల్ బాలికా వధు (తెలుగులో చిన్నారి పెళ్లి కూతురు) (balika vadhu cast)తో గుర్తింపు తెచ్చుకున్నారు సిద్దార్థ్. 'ఝలక్ దిఖ్లా జా 6', బిగ్‌బాస్ 13 (bigg boss siddharth shukla)షోలో పాల్గొని మరింత ఫేమ్ సంపాదించారు.
ప్రత్యూష బెనర్జీ
'చిన్నారి పెళ్లి కూతురు' ఫేమ్ ప్రత్యూష బెనర్జీ.. 25ఏళ్లకే ఆత్మహత్య చేసుకోవడం అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 2016 ఏప్రిల్ 1న ఆమె బలవంతంగా ప్రాణాలు తీసుకుంది. తమ కుమార్తె మరణానికి కారణం ప్రియుడు రాహుల్ రాజ్ అని ఆమె తల్లిదండ్రులు ఆరోపించారు. ప్రత్యూషను అతడు మానసికంగా వేధించాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్నేహితులు కూడా రాహుల్‌దే తప్పని విచారణలో చెప్పారు.
హీరో సుశాంత్ సింగ్
'ధోనీ' సినిమాతో దేశవ్యాప్తంగా విశేషాదరణ దక్కించుకున్న బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్(sushant singh rajput movies).. 34 ఏళ్ల వయసులో ఆత్మహత్య చేసుకున్నాడు. ముంబయిలోని తన నివాసంలో ఉరివేసుకుని సూసైడ్ చేసుకుని అభిమానుల్ని శోకసంద్రంలో ముంచాడు.
జియా ఖాన్
బాలీవుడ్‌లో నటిగా, గాయనిగా గుర్తింపు పొందారు జియా ఖాన్(jiah khan death). ఆమె 'గజిని', 'నిశ్శబ్ద్', 'హౌస్‌ఫుల్' సినిమాల్లో నటించారు. అందం, అభినయంతో అభిమానుల్ని సంపాదించుకున్న ఆమె.. 25 ఏళ్ల వయసులో ముంబయిలోని అపార్ట్‌మెంట్‌లో 2013 జూన్ 3న ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మరణానికి ముందు ఆరు పేజీల సూసైడ్ నోట్ రాశారు.
దివ్యభారతి- హీరోయిన్
తెలుగులో 'బొబ్బిలిరాజా' సినిమాతో గుర్తింపు పొందిన హీరోయిన్ దివ్యభారతి.. కేవలం 19 ఏళ్ల వయసులోనే ఆకస్మికంగా మృతి చెందింది. అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం రేపింది ఈమె మరణం.
సిల్మ్ స్మిత- నటి
ప్రత్యేక గీతాలతో గుర్తింపు తెచ్చుకున్న నటి సిల్మ్ స్మిత.. 36 ఏళ్ల వయసులోనే కన్నుమూసింది. ఈమె ఆత్మహత్య చేసుకోవడం అభిమానులను శోకసంద్రంలో ముంచేసింది. ఈ నటి జీవితం ఆధారం 'డర్టీ పిక్టర్' అనే సినిమా వచ్చింది.
ఉదయ్ కిరణ్- హీరో
ప్రేమకథా చిత్రాలతో గుర్తింపు పొందిన ఉదయ్‌కిరణ్.. 34 ఏళ్ల వయసులో ఆత్మహత్య చేసుకున్నాడు. కారణాలు ఏమైనప్పటికీ తక్కువ వయసులోనే మరణించాడు. చిత్రం, నువ్వునేను, మనసంతా నువ్వే సినిమాలతో ప్రేక్షకుల మదిలో చెరగని స్థానం సంపాదించుకున్నాడు.
మహానటి సావిత్రి
మహానటి సావిత్రి.. కేవలం 45 ఏళ్ల వయసులో లోకాన్ని విడిచి వెళ్లింది. కానీ ఆమె నటించిన సినిమాలు ఇప్పటికీ ప్రేక్షకుల మదిలో నిలిచిపోయాయి. 1935లో జన్మించిన సావిత్రి.. 1981లో కన్నుమూసింది. ఈమె జీవితం ఆధారంగా 'మహానటి' సినిమా తెరకెక్కింది.
ఆర్తి అగర్వాల్- హీరోయిన్
హీరోయిన్ ఆర్తి అగర్వాల్ 31 ఏళ్ల వయసులో మృతి చెందింది. బరువు తగ్గిందేకు లైపో ఆపరేషన్ చేస్తుండగా విఫలమై ఆమె చనిపోయిందనే ప్రచారం ఉంది. 2014లో ఈ కథానాయిక మరణించింది. నువ్వు నాకు నచ్చావ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఆర్తి.. ఆ తర్వాత అగ్ర హీరోల సరసన పలు హిట్ సినిమాలెన్నింటిలోనో నటించింది.
యశో సాగర్- హీరో
ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమాతో.. మంచి నటుడిగా గుర్తింపు పొందిన యశో సాగర్.. కారు ప్రమాదంలో ఆకస్మిక మరణం చెందాడు.
కునాల్ సింగ్
'ప్రేమికుల రోజు' చిత్రంతో కథానాయకుడి అరంగేట్రం చేసి, పాపులారిటీ సంపాదించుకున్నారు కునాల్ సింగ్. ఆయన ఛార్మింగ్ లుక్స్, హెయిర్ స్టైల్ అప్పట్లో యువతను ఆకర్షించాయి. ఆపై పలు సినిమాల్లో నటించిన ఆయన.. 2008 ఫిబ్రవరి 7న ఆత్మహత్య చేసుకున్నారు. ముంబయిలోని అపార్ట్‌మెంట్‌లో ఫ్యాన్‌కు ఉరివేసుకున్నారు. 33 ఏళ్ల వయసులోనే ప్రాణాలు తీసుకున్నారు.
ఇర్ఫాన్ ఖాన్..
ప్రముఖ బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్.. అరుదైన క్యాన్సర్‌తో 54వ ఏట కన్నుమూశారు. 2018 మార్చిలో తన అనారోగ్య పరిస్థితిపై తొలిసారిగా ప్రకటన చేసి అభిమానులను షాక్‌కు గురిచేశారు. 'అంగ్రేజీ మీడియం' సినిమాలో నటించారు. తెలుగులో సైనికుడు చిత్రంలో ఇర్ఫాన్ నటించి మెప్పించారు. 2011లో పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు.
ఇవీ చూడండి: