తన కోసం జాకీ బీర్ తాగడం మానేశాడని, ఇలా జీవితంలో చాలా త్యాగాలు చేశాడని బుల్లితెర నటి, జాకీ సతీమణి హరిత అన్నారు. సుమ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమయ్యే ఎంటర్‌టైనింగ్ షో 'క్యాష్: దొరికినంత దోచుకో'. ఆగస్టు 14న ప్రసారమయ్యే కార్యక్రమానికి హరిత-జాకీ, ప్రీతి నిగమ్-నగేష్ జోడీలు వచ్చి సందడి చేశారు.
ఈ సందర్భంగా సుమ అడిగిన ప్రశ్నలకు నగేష్-ప్రీతి జోడి సరదా సమాధానాలు ఇచ్చింది. భార్య గొప్పా.. భర్త గొప్పా.. అన్న ప్రశ్నకు నగేష్ ఇచ్చిన సమాధానానికి ప్రీతి అదిరిపోయే పంచ్ ఇవ్వడం వల్ల అందరూ పగలబడి నవ్వారు. ఇక ప్రీతి గురించి నగేష్ కవిత చెప్పడం, దానికి జాకీ తనదైన టైమింగ్‌తో చురకలు అంటించిన సమయంలో సెట్‌లో ఉన్నవాళ్లందరూ నవ్వాపుకోలేకపోయారు. వీరి సందడి చూడాలంటే ఆగస్టు 14 వరకూ వేచి చూడాల్సిందే. అప్పటివరకూ ఈ సరదా ప్రోమోను చూసేయండి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చదవండి:'అందుకే దానిపై మక్కువ పెంచుకున్నా'