ETV Bharat / sitara

ప్రైమ్​లో ఫవాద్ ఫాజిల్ 'సీ యూ సూన్' - ఫవాద్ ఫాజిల్ సినిమా

మలయాళ స్టార్ నటుడు ఫవాద్ ఫాజిల్​ హీరోగా 'సీ యూ సూన్' అనే చిత్రం తెరకెక్కింది. లాక్​డౌన్ సమయంలో అన్ని జాగ్రత్తలు పాటిస్తూ ఫోన్​లోనే షూటింగ్ పూర్తి చేశారు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీ ప్రకటించింది చిత్రబృందం.

సీ యూ సూన్
సీ యూ సూన్
author img

By

Published : Aug 22, 2020, 11:15 AM IST

లాక్​డౌన్ కారణంగా సినిమా షూటింగ్​లు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. బయటకెళ్లి చిత్రీకరణలు జరిపే పరిస్థితి లేదు. దీంతో అంతా కరోనా తగ్గుముఖం పట్టాలని కోరుకుంటూ ఇంటికే పరిమితమయ్యారు. అయితే ఇలాంటి సమయంలో ఓ మలయాళ సినిమా మాత్రం షూటింగ్ ప్రారంభించి పూర్తి చేసింది కూడా.

మలయాళ స్టార్ ఫవాద్ ఫాజిల్​ హీరోగా మహేశ్ నారాయణన్ దర్శకత్వంలో 'సీ యూ సూన్' అనే చిత్రం తెరకెక్కింది. ఈ సినిమాను పూర్తిగా ఐఫోన్​లోనే చిత్రీకరించడం విశేషం. లాక్​డౌన్ జాగ్రత్తలు పాటిస్తూ షూటింగ్ జరిపారు. తాజాగా ఈ సినిమాను సెప్టెంబర్ 1న అమెజాన్ ప్రైమ్​ వేదికగా విడుదల చేస్తున్నట్లు వెల్లడించింది చిత్రబృందం.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.