జేమ్స్‌బాండ్.. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాలకు విపరీతమైన క్రేజ్ ఉంది. ఎప్పుడైన ఊహించారా... ఈ పాత్రను మహిళా నటి పోషిస్తే ఎలా ఉంటుందో. కానీ అది సాధ్యపడదంటున్నారు బాండ్ సిరీస్‌లో 25వ చిత్రాన్ని నిర్మిస్తున్న బార్బరా బ్రకోలి. ఆ పాత్ర పురుషుడే చేయాలని తాను అనుకుంటున్నానని ఆమె తెలిపారు.
"జేమ్స్ బాండ్ పాత్రను పురుషుడే చేయాలని నేను అనుకుంటున్నా. మహిళల గురించి, మహిళ ప్రధాన పాత్రలుగా సినిమాలు తీయడానికి నేను ఇష్టపడతాను. కానీ పురషుడి పాత్రను మహిళగా మార్చడాన్ని నేను అంగీకరించలేను" - బార్బరా బ్రకోలి, బాండ్ 25వ చిత్ర నిర్మాత.
జేమ్స్‌బాండ్ 25వ చిత్రాన్ని జమైకాలో ఆవిష్కరిస్తూ.. ఆమె ఈ విషయాన్ని తెలిపారు. ప్రస్తుతం ఈ సినిమాలో డేనియల్ క్రేగ్.. బాండ్‌గా నటిస్తున్నాడు. ఇప్పటివరకు అతడు నాలుగు సినిమాల్లో జేమ్స్‌బాండ్‌గా కనిపించాడు.
బాండ్ సిరీస్‌లో ఇప్పటివరకు 24 చిత్రాలు వచ్చాయి. త్వరలో రాబోతున్న 25వ చిత్రంలో ఆస్కార్ విజేత రమీ మాలెక్ ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు.