Vicky kaushal Katrina kaif Marriage: అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న బాలీవుడ్ లవ్లీకపుల్ కత్రినాకైఫ్-విక్కీ కౌశల్ మరి కొన్ని గంటల్లో మూడు ముళ్ల బంధంతో ఒక్కటవ్వనున్నారు. మధ్యాహ్నం 3.30-3.45 గంటల మధ్యలో వీరిద్దరూ కలిసి ఏడడుగులు వేయనున్నట్లు సమాచారం. రాజస్థాన్‌లోని సిక్స్‌సెన్సెస్ ఫోర్ట్ ఈ పెళ్లికి వేదికవుతుంది. ఇరు కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఈ కార్యక్రమం ఘనంగా జరుగుతోంది. ఇప్పటికే డిసెంబరు 8, 9 తేదీల్లో సంగీత్, హల్దీ, మెహందీ వేడుకలు బాగా జరిగాయి. ఇందులో పలువురు సెలబ్రిటీలు పాల్గొన్ని సందడి చేశారు.
విక్కీ-కత్రినా పెళ్లికి ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు తమ కుటుంబాలతో హాజరుకాగా మరికొంతమంది ముహూర్తం సమయానికి రానున్నారు. ఇప్పటికే దర్శకుడు కబీర్‌ఖాన్, నేహాదూపియా, అంగడ్‌బేడీ, కరణ్ జోహార్, ఫర్హాన్ ఖాన్ వివాహ వేదిక వద్దకు చేరుకోగా.. ఆలియాభట్, రోహిత్ శెట్టి, వరుణ్ ధావన్, అనురాగ్ కశ్యప్ సహా పలువురు ప్రముఖులు వస్తారని తెలుస్తోంది. మొత్తంగా 120మంది అథితులు ఈ వేడుకకు హాజరుకానున్నారు.
మెహందీ వేడుక జరిగిందిలా..
కత్రినా-విక్కీ కౌశల్‌ల మెహందీ వేడుక బుధవారం ఉదయం జరిగింది. ఈ వేడుకలో ప్రముఖ మెహందీ ఆర్టిస్ట్ వీణా పాల్గొని.. వధూవరులకు గోరింటాకు పెట్టారు. పెళ్లికి విచ్చేసిన అతిథులూ ఈ మెహందీ వేడుకలో పాల్గొన్నారు. ఈ గోరింటాకు రాజస్థాన్‌లోని ఓ ప్రాంతం నుంచి ప్రత్యేకంగా తెప్పించారు. దాదాపు 20కేజీల గోరింటాకు పౌడర్ సహా 400 మెహందీ కోన్స్‌ను ఆర్డర్ చేశారని తెలిసింది. ఈ ప్రాంతంలో గోరింటాకును సహజసిద్ధంగా పడించడం విశేషం.
సంగీత్ కోసం ప్రత్యేకంగా..
బుధవారం సాయంత్రం వీరి సంగీత్ జరిగింది. కత్రినాని తమ కుటుంబంలోకి స్వాగతిస్తూ.. పంజాబీ సంస్కృతికి అద్దంపట్టేలా మ్యూజికల్ కాన్సర్ట్‌కు విక్కీ కుటుంబం ప్లాన్ చేసింది. కత్రినాపై ఉన్న ప్రేమను తెలియజేస్తూ విక్కీ.. బాలీవుడ్ సూపర్‌హిట్ సాంగ్ 'తేరీ ఓరే'ని అందరి సమక్షంలో ఆలపించారని తెలిసింది.
ఫోన్స్‌కు నో ఎంట్రీ!
Vicky kaushal katrina kaif wedding amazon prime: తమ పెళ్లికి వచ్చే అతిథులకు కొన్ని నిబంధనలు పెట్టారు విక్కీ-కౌశల్. పెళ్లి మండపానికి ఫోన్లను తీసుకురావద్దని కోరారు. కాగా, నాలుగు రోజుల పాటు జరిగే విక్కీ-కత్రినా పెళ్లి పూర్తి వీడియో హక్కుల్ని ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకున్నట్లు తెలిసింది. ఇందుకోసం దాదాపు రూ.80 కోట్లు చెల్లించినట్లు సమాచారం. వచ్చే ఏడాది ప్రారంభంలో ఇది నెటిజన్లకు అందుబాటులో రానుందని సమచారం.
ఇదీ చూడండి: విక్కీ-కత్రినా పెళ్లి వీడియో.. రూ.80 కోట్లకు ఆ ఓటీటీ సొంతం!