ETV Bharat / sitara

'గోల్​మాల్' తుషార్‌.. అభిమానులకు హుషార్‌ - తుషార్​ స్పెషల్​ బర్తడే

'గోల్​మాల్'‌ ఫేం నటుడు తుషార్‌ కపూర్‌.. తనదైన నటనతో అభిమానుల మనసులో చోటు సంపాదించుకున్నారు. నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక కథనం మీకోసం..

tushar
తుషార్
author img

By

Published : Nov 20, 2020, 5:30 AM IST

నిన్నటి తరం నటుడు జితేంద్ర సినీ వారసుడు... తుషార్‌ కపూర్‌. ఈయన ఏక్తా కపూర్‌ సోదరుడు. బాలాజీ టెలీఫిల్మ్స్, బాలాజీ మోషన్‌ పిక్చర్స్‌కు సహ యజమానిగా వ్యవహరించారు 'ముఝే కుచ్‌ కెహనా హై', 'ఖాకీ', 'క్యా కూల్‌ హై హమ్', 'గోల్​మాల్ - ఫన్‌ అన్లిమిటెడ్‌', 'డోల్‌', 'గోల్​మాల్ రిటర్న్స్‌' సినిమాలు తుషార్‌ కపూర్‌కు మంచి పేరు తెచ్చిపెట్టాయి. నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక కథనం మీ కోసం..

tushar
తుషార్‌

వ్యక్తిగత జీవితం

తుషార్‌ కపూర్‌ తల్లిదండ్రుల పేర్లు జితేంద్ర, శోభా కపూర్‌. తండ్రి జితేంద్ర దిల్దార్‌ చిత్రం షూటింగ్‌లో ఉన్నప్పుడు తుషార్‌ పుట్టాడనే వార్త ఆయనకు తెలిసింది. తుషార్‌ సోదరి ఏక్తా కపూర్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. బొంబాయి స్కాటిష్‌ స్కూల్‌లో జితేంద్ర విద్యాభ్యాసం జరిగింది. చదువులో ఎప్పుడూ చురుకుగా ఉండేవారు తుషార్‌. ఆ తరువాత స్టీఫెన్‌ ఎం.రాస్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌లో బిబిఎ డిగ్రీ చదివారు. తండ్రిలాగే, తుషార్‌ కపూర్‌ కూడా నిచిరెన్‌ బౌద్ధమతం అనుచరుడు. తుషార్‌ ఐవిఎఫ్‌ను ఎంచుకొని, జూన్‌ 2016లో సరోగసీ ద్వారా లక్సయ కపూర్‌కు ఒంటరి తండ్రి అయ్యారు.

tushar
తుషార్‌

కెరీర్‌

సినిమాల్లో నటించక ముందు దర్శకుడు డేవిడ్‌ ధావన్‌ దగ్గర తుషార్‌ కపూర్‌ సహాయకుడిగా పనిచేశారు. దీని తరువాత రోషన్‌ తనేజా, మహేంద్ర వర్మలతో కలిసి వారి నటన పాఠశాలలో నటనలో శిక్షణ పొందారు. నిమేష్‌ భట్‌తో కలిసి నాట్యంలో శిక్షణ పొందారు.

నటించిన సినిమాలు

2001లో ముఝే కుచ్‌ కెహెనా హై సినిమాతో వెండితెరకు నటుడిగా పరిచయం అయ్యారు. ఈ సినిమాలో కరీనా కపూర్‌ హీరోయిన్‌గా నటించారు. తెలుగులో పవన్‌ కళ్యాణ్, కీర్తి రెడ్డి హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన సూపర్‌ హిట్‌ తొలిప్రేమ సినిమాకు ఈ చిత్రం రీమేక్‌. ఈ సినిమాలో నటనకు బెస్ట్‌ మేల్‌ డెబ్యూగా ఫిలింఫేర్‌ పురస్కారాన్ని అందుకున్నారు.

అనంతరం క్యా దిల్‌ నే కహాలో రాహుల్‌గా, జీనా సిర్ఫ్‌ మేరె లియేలో కరణ్‌గా, కుచ్‌ తో హైలో కరణ్‌గా, యే దిల్‌లో రవిగా, శరత్‌: ద ఛాలెంజ్‌లో జై కపూర్‌గా, గాయబ్‌లో విష్ణు ప్రసాద్‌ గా, ఖాకీలో సబ్‌ ఇన్స్పెక్టర్‌ అశ్విన్‌ గుప్తేగా, ఇన్సాన్‌లో అవినాష్‌గా, క్యా కూల్‌ హై హమ్​లో రాహుల్‌గా కనిపించారు.

ఇక గోల్మాల్‌లో లక్కీగా, గుడ్‌ బాయ్‌ బాడ్‌ బాయ్‌లో రాజన్‌ మల్హోత్రాగా, క్యా లవ్‌ స్టోరీ హైలో అర్జున్‌గా, డోల్‌లో సమీర్‌ సామ్‌ ఆర్యగా, వన్‌ టూ త్రిలో లక్ష్మి నారాయణ్‌గా, గోల్మాల్‌ రిటర్న్స్’లో లక్కీగా, లైఫ్‌ పార్టనర్‌లో భవేష్‌గా, గోల్మాల్‌ 3లో లక్కీగా, షోర్‌ ఇన్‌ ద సిటీలో తిలక్‌గా, లవ్‌ యు... మిస్టర్‌ కళాకార్‌లో సాహిల్‌గా, హమ్‌ తుం సభానాలో రిషి మల్హోత్రాగా, ద డర్టీ పిక్చర్‌లో రమాకాంత్‌గా, చార్‌ దిన్‌ కి చాందినిలో వీర్‌ విక్రమ్‌ సింగ్‌గా, క్యా సూపర్‌ కూల్‌ హై హమ్​లో ఆదిగా, పోస్టర్‌ బాయ్స్‌లో లక్కీగా, గోల్మాల్‌ అగైన్‌, సింబాలలో లక్కీగా తదితర పాత్రలతో ప్రేక్షకులను అలరించారు. ప్రస్తుతం పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.

tushar
తుషార్‌

ఇదీ చూడండి : రామ్​ స్టైలిష్​ ఫోజులకు నెటిజన్లు ఫిదా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.