ముంబయిలోని తన కార్యాలయాన్ని బీఎంసీ అధికారులు బలవంతంగా స్వాధీనం చేసుకున్నారని బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఆరోపించింది. తన పొరుగువారిని కూడా వేధిస్తున్నట్లు పేర్కొంది. మంగళవారం ఆ భవనాన్ని కూల్చివేస్తున్నట్లు తనకు సమాచారం ఇచ్చినట్లు నటి వెల్లడించింది. ఈ క్రమంలోనే ట్విట్టర్ వేదికగా తన ఆఫీసుకు సంబంధించిన వీడియోను పంచుకుంది.
-
They have forcefully taken over my office measuring everything, also harassing my neighbors when they retorted @mybmc officials used language like ,” वो जो मैडम है उसकी करतूत का परिणाम सबको भरना होगा” I am informed tomorrow they are demolishing my property 🙂 pic.twitter.com/efUOGJDve1
— Kangana Ranaut (@KanganaTeam) September 7, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">They have forcefully taken over my office measuring everything, also harassing my neighbors when they retorted @mybmc officials used language like ,” वो जो मैडम है उसकी करतूत का परिणाम सबको भरना होगा” I am informed tomorrow they are demolishing my property 🙂 pic.twitter.com/efUOGJDve1
— Kangana Ranaut (@KanganaTeam) September 7, 2020They have forcefully taken over my office measuring everything, also harassing my neighbors when they retorted @mybmc officials used language like ,” वो जो मैडम है उसकी करतूत का परिणाम सबको भरना होगा” I am informed tomorrow they are demolishing my property 🙂 pic.twitter.com/efUOGJDve1
— Kangana Ranaut (@KanganaTeam) September 7, 2020
"ఇది ముంబయిలోని 'మణికర్ణిక' సినిమా కార్యాలయం. నేను పదిహేనేళ్లుగా ఇక్కడే కష్టపడ్డా. నేను నిర్మాతనైతే నాకంటూ ఒక ఆఫీసు ఉండాలనేదని నా ఏకైక కల. కానీ ఇప్పుడు అకస్మాత్తుగా కొంతమంది వచ్చి నా కలను చెదరగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. నా కార్యాలయాన్ని బలవంతంగా స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం దానిని కూల్చేస్తారని చెప్పారు."
-కంగనా రనౌత్, సినీ నటి
బీఎంసీ అధికారులు ఎటువంటి నోటీసులు పంపకుండా.. తన కార్యాలయంలోకి ప్రవేశించారని కంగన పేర్కొంది. "నా దగ్గర అన్ని పత్రాలు ఉన్నాయి. బీఎంసీ నుంచి ఎటువంటి చట్టవిరుద్ధమైన అనుమతులు నేను పొందలేదు. ఈ నిర్మాణం అక్రమమని చూపించాలంటే.. ముందు నిర్మాణ ప్రణాళికను పంపించాలి" అని కంగన వివరించింది.
ఇటీవలే బాలీవుడ్ మాఫియా కన్నా ముంబయి పోలీసుల వల్లే తాను ఎక్కువగా భయపడుతున్నట్లు కంగన చెప్పింది. దీనిపై స్పందించిన శివసేన నేత సంజయ్.. ఆమెను ముంబయికి రావొద్దంటూ బహిరంగంగానే చెప్పారు. దీనిపై స్పందిస్తూ ముంబయిని పాక్ ఆక్రమిత కశ్మీర్‌తో పోలుస్తూ.. కంగన ట్వీట్ చేసింది. దీంతో ఈ వివాదం మరింత వేడెక్కింది.