ETV Bharat / sitara

బాలీవుడ్​ ముద్దుల హీరోకు పుట్టినరోజు శుభాకాంక్షలు

సీరియల్ కిస్సర్​గా పేరు తెచ్చుకున్న నటుుడు ఇమ్రాన్ హష్మీ. మర్డర్, రాజ్, జన్నత్, దిల్‌ తో బచ్చా హై జీ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న ఇమ్రాన్ నేడు 39 ఏళ్లు పూర్తి చేసుకుని 40వ పడిలో అడుగుపెడుతున్నాడు.

author img

By

Published : Mar 24, 2019, 6:45 AM IST

ముద్దుల హీరోకి పుట్టినరోజు శుభాకాంక్షలు

ఇమ్రాన్ హష్మీ...బాలీవుడ్​లో రొమాంటిక్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అదర చుంబనాలంటే గుర్తొచ్చేది ఇమ్రానే. అంతగా పాపులర్ అయ్యాడీ మర్డర్ సినిమా కథానాయకుడు. కుమారుడు అయాన్ ముఖర్జీకి క్యాన్సర్..​ ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది. నేడు ఇమ్రాన్ హష్మీ పుట్టినరోజు సందర్భంగా ఆయన జీవిత విశేషాలపై ఓ లుక్కేద్దాం!

  • " class="align-text-top noRightClick twitterSection" data="">
  • జననం..

1979 మార్చి 24న ముంబయిలో జన్మించాడు ఇమ్రాన్ హష్మీ. మహేష్‌ భట్‌ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఈ రొమాంటిక్‌ హీరోకు ‘సీరియల్‌ కిస్సర్‌’ అనే ఓ వైవిధ్యమైన గుర్తింపు ఉంది. 2014లో తన కుమారుడు అయాన్​కు క్యాన్సర్​ రావడం ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది. అప్పటి నుంచి రొమాంటిక్ సన్నివేశాలున్న చిత్రాలకు దూరంగా ఉంటున్నాడు. కిస్ ఆఫ్ లైఫ్ అనే పుస్తకం రాసి, తన జీవితంలోని ముఖ్యమైన అంశాలను అందులో పంచుకున్నాడు.

  • సినీ ప్రస్థానం..

విక్రమ్ భట్ చిత్రం ఫుట్​పాత్ ద్వారా బాలీవుడ్ రంగప్రవేశం చేశాడు ఇమ్రాన్. 2004లో మర్డర్ చిత్రం ద్వారా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సినిమాలో మల్లికా షెరావత్​తో చేసిన అదరచుంబనాలు అప్పట్లో ఓ సంచలనం. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద భారీ విజయాన్నందుకుంది. అక్కడి నుంచి జెహర్‌’, ‘ఆషిక్‌ బానాయా అప్నే’, ‘గ్యాంగ్‌స్టర్‌’ జన్నత్ లాంటి వరుస హిట్లను అందుకున్నాడీ ముద్దుల హీరో. దాదాపు 16 ఏళ్ల సినీ కెరీర్‌లో 40కి పైగా చిత్రాల్లో నటించాడు. వీటిలో ఎక్కువ శాతం రొమాంటిక్, క్రైమ్‌ థ్రిల్లర్‌ సినిమాలే ఉన్నాయి.

  • గేరు మార్చిన హీరో...

2010 అనంతరం ఎక్కువగా థ్రిల్లర్ చిత్రాలపై దృష్టి సారించాడు. ‘రాజ్‌: ది మిస్టరీ కంటిన్యూస్‌’, ‘ది డర్టీ పిక్చర్‌’, ‘మర్డర్‌2’, ‘దిల్‌ తో బచ్చా హై జీ’, ‘జన్నత్‌ 2’, ‘వన్స్‌ అపాన్​ ఎ టైమ్‌ ఇన్‌ ముంబయి’, ‘షాంఘై’, ‘బాద్‌షాహో’ తదితర చిత్రాలతో ఆకట్టుకున్నాడు. మూడుసార్లు ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్‌ నామినేషన్లు అందుకున్నాడు. ఇటీవలే ‘వై చీట్‌ ఇండియా’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఇమ్రాన్‌.. ప్రస్తుతం ‘మర్డర్‌ 4’లో నటిస్తున్నాడు.

Srinagar (J and K), Mar 23 (ANI): While addressing the media, Former Jammu and Kashmir chief minister Mehbooba Mufti announced that she will contest election from Anantnag Parliamentray constituency. "Our party is the largest party in the state. I will be contesting from Anantnag parliamentary constituency," said Mufti while addressing a press conference today. Anantnag will go to polls in third, fourth and fifth phases.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.