బిగ్‌బాస్‌లో హౌస్(nagarjuna bigg boss)లో కెప్టెన్సీ టాస్క్ రసవత్తరంగా సాగుతోంది. కెప్టెన్ పోటీదారులైన రవి(bigg boss ravi anchor), సన్నీ(bigg boss sunny telugu) రాకుమారులుగా ప్రజల హృదయాలను గెలుచుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో హౌస్‌మేట్స్ కొందరు సన్నీని, మరికొందరు రవిని సపోర్ట్ చేస్తున్నారు. మధ్యలో బిగ్‌బాస్ ఇచ్చే టాస్క్‌లను గెలిచి కాయిన్స్ పొందాల్సి ఉంది. ఇందులో భాగంగా మల్లయుద్ధం టాస్క్‌లో మానస్, విశ్వ పోటీ పడ్డారు. బరిలోకి దిగిన వెంటనే కండల వీరుడైన విశ్వను మానస్ మట్టి కరిపించాడు. కానీ, తాను చెప్పేవరకూ టాస్క్ ప్రారంభం కాదని, సంచాలకుడు శ్రీరామ్ చెప్పడం వల్ల మళ్లీ ఆడాల్సి వచ్చింది. ఈసారి మానస్ గట్టి పోటీ ఇచ్చినా, విశ్వ(bigboss viswa) చేతిలో ఓడిపోయాడు. ఆ తర్వాత సన్నీ టీమ్ నుంచి జెస్సీ ఆడేందుకు ముందుకు రాగా, రవి టీమ్‌లో ఉన్న పురుషుల్లో శ్రీరామ్ ఆడటానికి ఆసక్తి చూపలేదు. ఎందుకు ఆడటానికి ముందుకు రాలేదో కారణం మాత్రం చెప్పలేదు. ఇక రాకుమారుడైన రవి 'నాకు నడుము నొప్పి ఆడలేను' అని చెప్పాడు. దీంతో అనీ మాస్టర్, జెస్సీ తలపడాల్సి వచ్చింది. అనీ మాస్టర్‌ను జెస్సీ సులభంగానే ఓడించినా, ఎక్కడా ఇబ్బందికరంగా వ్యవహరించలేదు. తన వల్ల ఏదైనా ఇబ్బంది పడి ఉంటే క్షమించమన్నట్లు నమస్కారం చేశాడు జెస్సీ. చివరి ప్రియాంక-శ్వేత వర్మ పోటీ పడగా, గట్టి పోటీ ఇస్తుందనుకున్న ప్రియాంక ముందే చేతులెత్తేసింది.
అందరూ పడుకున్నాక శ్రీరామ్-హమీదా రొమాన్స్, కాయిన్స్ చోరీ
తమ దగ్గర ఉన్న కాయిన్స్ ఎవరైనా దొంగిలిస్తారేమోనని సిరి, షణ్ముఖ్, జెస్సీ(bigboss jessy) ఒకే మంచంపై పడుకున్నారు. ఇక అందరూ నిద్రపోయిన తర్వాత శ్రీరామ్-హమీదా ఇంటి సభ్యుల వద్ద ఉన్న కాయిన్స్ దొంగిలించేందుకు యత్నించారు. మానస్(bigboss manas) దగ్గర ఉన్న కాయిన్స్‌ను శ్రీరామ్ చాకచక్యంగా తీసేసి, 'ఇతను డబ్బును ఏం కాపాడతాడు' అంటూ హేళనగా మాట్లాడాడు. ఆ కాయిన్స్‌ను హమీదా(bigg boss hamida movies) ఇచ్చి, ఒకరినొకరు హత్తుకున్నారు. ఆ తర్వాత ఫ్లైయింగ్ కిస్‌లు ఇచ్చుకుని నిద్రకు ఉపక్రమించారు. ఉదయం లేవగానే ఎవరెవరు ఏ టీమ్‌లో ఉంటే ఎవరు గెలుస్తారన్న చర్చ ఇంటి సభ్యుల మధ్య జరిగింది.
ఫొటో టాస్క్ కాస్తా.. ఫిజికల్ టాస్క్ అయింది
మరో టాస్క్‌లో భాగంగా కెప్టెన్ పోటీదారులైన రవి, సన్నీల ఫొటోలను బోర్డుపై ఉంచాల్సిందిగా బిగ్‌బాస్ చెప్పాడు. సైరన్ మోగే సమయానికి సన్నీ టీమ్ నుంచి మానస్, జెస్సీలు బోర్డు దగ్గర ఉండి ఫొటోలు పెట్టేందుకు యత్నించారు. రవి ఫొటోలను మానస్ స్విమ్మింగ్ ఫూల్‌లో పడేయగా, ఆలస్యంగా టాస్క్‌లోకి వచ్చిన శ్రీరామ్, విశ్వలు బోర్డుపై ఉంచి సన్నీ ఫొటోలను లాగేందుకు యత్నించారు. ఈ క్రమంలో జెస్సీ-శ్రీరామ్(bigg boss sriram jessy), మానస్-విశ్వలు ఒకరినొకరు ఆపేందుకు ప్రయత్నించారు. శ్రీరామ్, జెస్సీలకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ టాస్క్‌లో సన్నీ టీమ్ విజయం సాధించింది. శ్రీరామ్ ఓడిపోయినందుకు షణ్ముఖ్(shanmukh bigg boss 5 telugu) తెగ సంబరపడిపోయాడు.
లాక్కో లాక్కో తాడు.. శ్రీరామ్ అతి తెలివి
కొద్దిసేపటికి ఇంటి సభ్యులకు బిగ్‌బాస్ 'లాక్కో లాక్కో తాడు' టాస్క్ ఇచ్చాడు. సంచాలకుడు అయిన శ్రీరామ్ తాను పోటీలో ఉంటానని, అందుకు సన్నీ టీమ్‌లో ఉన్న మానస్‌ను సంచాలకుడిగా చేస్తానని ప్రతిపాదన చేశాడు. శ్రీరామ్ అతి తెలివి గ్రహించిన మానస్, సన్నీలు అందుకు ఒప్పుకోలేదు. దీంతో హమీదను సంచాలకుడిగా ఉంచారు. ఈ టాస్క్‌లో మూడుసార్లు సన్నీ టీమ్ తాడును లాగేసి విజయం సాధించింది. మరి చివరకు కెప్టెన్సీ టాస్క్‌లో ఎవరు గెలిచారు? ఎవరు కొత్త కెప్టెన్ అయ్యారో తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే! ప్రియాంక తండ్రి మాట్లాడిన ఆడియోను ప్లే చేసి, ఎమోషనల్ కంటెంట్‌కు బిగ్ బాస్ తెరతీశాడు.
ఇదీ చూడండి: Nataraj Master: 'రవి పులిహోర రాజా.. శ్వేతకు తిక్క.. మరి కాజల్..?'