ETV Bharat / sitara

యువతికి తండ్రి పాత్రలో బాలయ్య! - బాలకృష్ణ బి గోపాల్ సినిమా అప్​డేట్స్

నందమూరి బాలయ్య ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఆ చిత్రం పూర్తి కాగానే బి.గోపాల్​తో ఓ చిత్రం పట్టాలెక్కించేందుకు సిద్ధమవుతున్నారట.

బాలయ్య
బాలయ్య
author img

By

Published : May 17, 2020, 5:15 AM IST

నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నారు. అయితే ఈ సినిమా తర్వాత తన 107వ చిత్రాన్ని బి.గోపాల్‌ దర్శకత్వంలో చేయనున్నారని సినీ వర్గాలు నుంచి వినిపిస్తున్న సమాచారం. ఇప్పటికే సినిమాకు సంబంధించి స్ర్కిప్టుని కూడా రాసుకున్నారట.

ఈ చిత్రం కోసం రచయిత బుర్రా సాయిమాధవ్‌ స్ర్కిప్టుకి మరింత బలం చేకూర్చే విధంగా తయారు చేస్తున్నారని అప్పట్లో వార్తలొచ్చాయి. ఇందులో బాలయ్య ఓ యవతికి తండ్రి పాత్రలో కనిపించబోతున్నారట. మొత్తం మీద కరోనా వైరస్‌ ప్రభావంతో విధించిన లాక్‌డౌన్‌ పూర్తికాగానే బోయపాటి చిత్రం షూటింగ్‌ జరుపుకోనుంది. ఈ చిత్రం పూర్తయిన వెంటనే బి.గోపాల్‌ సినిమా మొదలుపెట్టనున్నారని సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.