ఓ హీరో కోసం రాసుకున్న కథ మరొకరితో చేయాల్సిన పరిస్థితి దర్శకులకు అప్పుడప్పుడు ఎదురవుతుంది. అందుకు కారణాలు చాలానే ఉంటాయి. ఇలాంటి ఘటనలే సంగీత దర్శకులకూ జరుగుతుంటాయి. ఓ సినిమా కోసం కట్టిన బాణీ, అనుకోని పరిస్థితుల్లో మరో చిత్రానికి ఉపయోగించాల్సి వస్తుంది. అలా మార్పు జరిగి, సూపర్ హిట్ అయిన పాటే పవర్‌స్టార్ పవనకల్యాణ్ 'గబ్బర్ సింగ్'లోని 'పిల్లా నువ్వు లేని జీవితం'.
'పిల్లా అట్ట నవ్వేసేసి పారిపోమాకే బాబు.. మీరేంట్రా! నన్ను చూస్తున్నారు, ఎవడి డప్పు ఆడు కొట్టండెహే' అంటూ పవన్ డైలాగ్‌లతో మొదలయ్యే ఈ పాట ఎంత హుషారెత్తిస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముందుగా ఈ గీతాన్ని మరో చిత్రం కోసం స్వరపరిచాడు దేవీ. కానీ, ఆ కథలో ఈ మాస్ బీట్ పెట్టే అవకాశం రాలేదు. అలా 'గబ్బర్ సింగ్' ఆల్బమ్‌లోకి వచ్చి చేరింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
'గబ్బర్ సింగ్' షూటింగ్ మొదలైనప్పుడు, అభిమానులను ఊపేసే మాస్ గీతం ఒకటి సిద్ధం చేయాలని హరీశ్.. దేవీకి చెప్పాడు. అప్పుడు 'పిల్లా నువ్వులేని జీవితం' ట్యూన్ వినిపించాడు. దానిని హరీశ్ వెంటనే ఓకే చేశాడు. అప్పటికి పల్లవి మాత్రమే చెప్పినా, చరణాలు రాసే బాధ్యత దేవీనే తీసుకున్నాడు. ఈ పాటతో సంగీత దర్శకుడిగానే కాకుండా రచయితగానూ సంచలనం సృష్టించాడు.
ఇదీ చూడండి.. ఆ మూడు రోజులు 24x7 నాన్‌స్టాప్ షోలు