ETV Bharat / sitara

Movie Updates: నాగలక్ష్మి వచ్చేస్తోంది.. ఓటీటీలో 'రొమాంటిక్‌' - romantic updates

సినీ అప్డేట్స్ వచ్చేశాయి. బంగార్రాజు, రొమాంటిక్‌, నయీం డైరీస్​, శశివదనే చిత్రాల కొత్త సంగతులు ఇందులో ఉన్నాయి.

movie updates
రొమాంటిక్‌ సినిమా
author img

By

Published : Nov 16, 2021, 7:50 PM IST

'సోగ్గాడే చిన్నినాయనా'కు(Nagarjuna movies) కొనసాగింపుగా రూపొందుతున్న చిత్రం బంగార్రాజు. నాగ్‌కు జోడీగా రమ్యకృష్ణ, నాగచైతన్యకు జోడీగా కృతిశెట్టి ఇందులో నటిస్తున్నారు. కల్యాణ్‌కృష్ణ కురసాల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో నటిస్తున్న నాగలక్ష్మి అనే కీలక ప్రాతను ఈ నెల 18న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తెలిపింది.

bangarraju
బంగార్రాజు మూవీ

ఈ చిత్రాన్ని అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna movies).. జీ స్టూడియోస్‌తో కలిసి నిర్మిస్తున్నారు. సంక్రాంతి లక్ష్యంగా ముస్తాబవుతోంది. ఇందులో నాగార్జున, నాగచైతన్య కలిసి నటిస్తుండడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. రావు రమేష్‌, చలపతిరావు, బ్రహ్మాజీ, వెన్నెల కిశోర్‌, ఝాన్సీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి అనూప్‌ రూబెన్స్‌ సంగీతం అందిస్తున్నారు.

ఓటీటీలో 'రొమాంటిక్‌'

ఆకాష్‌ పూరీ, కేతికా శర్మ జంటగా అనిల్‌ పాదూరి దర్శకత్వం వహించిన చిత్రం 'రొమాంటిక్‌'(romantic movie release date). పూరీ కనెక్ట్స్‌ పతాకంపై పూరీ జగన్నాథ్‌, ఛార్మి సంయుక్తంగా నిర్మించారు. రమ్యకృష్ణ కీలక పాత్ర పోషించగా, సునీల్‌ కశ్యప్‌ స్వరాలు సమకూర్చారు. ఈ సినిమాను నవంబర్​ 26న ఓటీటీలో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది.

romantic
రొమాంటిక్​ సినిమా

'నయీం డైరీస్'​ ట్రైలర్ రిలీజ్​..

గ్యాంగ్​స్టర్ నయీం జీవితం ఆధారంగా తెరకెక్కిన 'నయీం డైరీస్'​ చిత్ర ట్రైలర్​ విడుదలైంది. దర్శకుడు సంపత్​ నంది చేతుల మీదుగా ట్రైలర్​ను రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి దాము బాలాజీ దర్శకత్వం వహించగా వశిష్ఠ సింహా ప్రధాన పాత్రలో నటించారు. నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా కాబట్టి ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

'శశివదనే' షూటింగ్​ షురూ..

కోమలీ ప్రసాద్​, రక్షిత్ అట్లూరి జంటగా నటించిన 'శశివదనే' చిత్రం షూటింగ్ ప్రారంభమైంది. దర్శకుడు మారుతి క్లాప్ కొట్టి చిత్రీకరణను ప్రారంభించారు. రామానాయుడు స్టూడియోస్​లో పూజా కార్యక్రమాలు నిర్వహించి షూటింగ్​ను మొదలుపెట్టారు. ఉబ్బన సాయి మోహన్​ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని అహితేజ నిర్మిస్తున్నారు. కులం మధ్య ప్రేమ ఎలా గెలిచిందనేదే ఈ సినిమా కథాంశం. ఇప్పటికే విడుదలైన సినిమా టీజర్​ ప్రేక్షకులను మెప్పించింది.

shashivadane
శశివదనే మూవీ
shashivadane
క్లాప్​ కొట్టిన దర్శకుడు మారుతి
shashivadane
శశివదనే చిత్ర బృందం

ఇదీ చదవండి:మైక్ టైసన్​తో 'లైగర్'​.. 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్​లర్' ఓటీటీ ట్రైలర్

'ఓరి దేవుడా'.. ఏంటీ ఈ క్యూట్​నెస్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.