ETV Bharat / sitara

నారీ.. నారీ.. నడుమ 'బాల' మురారీ! - ఇద్దరు నాయికలతో బాలయ్య

'లెజెండ్​' బాలకృష్ణ-గోపీచంద్​ మలినేని కాంబోలో రానున్న చిత్రాన్ని నిజజీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కించనున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్​ వర్క్​ జరుగుతోంది. అయితే ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లను ఎంపిక చేయనున్నారని ప్రచారం జరుగుతోంది.

Balakrishna to romance two heroines in Gopichand Malineni Directional
నారీ.. నారీ.. నడుమ మురారీ!
author img

By

Published : May 6, 2021, 7:06 AM IST

నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనుంది. దీన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ప్రస్తుతం స్క్రిప్ట్‌ పనులు జరుగుతున్నాయి. వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిస్తోన్న కథతో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఇందులో బాలకృష్ణకు జోడీగా ఇద్దరు కథానాయికలు కనిపించనున్నారని సమాచారం.

ఇటీవల కాలంలో బాలకృష్ణ సినిమాల్లో ఎక్కువగా ఇద్దరు నాయికలు కనిపిస్తున్నారు. గోపీచంద్‌ తీసే చిత్రాల్లోనూ ఇద్దరు భామలకు చోటిస్తున్నారు. ఇటీవల ఈ దర్శకుడి నుంచి వచ్చిన 'క్రాక్‌'లో శ్రుతిహాసన్‌తో పాటు అప్సర రాణి తళుక్కున మెరిసింది.

ఇప్పుడీ క్రమంలోనే బాలకృష్ణ కోసం ఇద్దరు నాయికల్ని రంగంలోకి దింపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఓ నాయికగా రాయ్‌ లక్ష్మీ పేరు పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో బాలయ్య ఓ శక్తిమంతమైన పోలీస్‌ అధికారిగా కనిపించనున్నారని సమాచారం.

ఇదీ చూడండి: టాలీవుడ్​లో బాలీవుడ్​ భామల జోరు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.