ETV Bharat / sitara

బాబాయ్‌-అబ్బాయ్‌ మల్టీస్టారర్‌పై క్లారిటీ - బాలకృష్ణ ఎన్టీఆర్ తాజా వార్తలు

నందమూరి బాలకృష్ణ-జూనియర్ ఎన్టీఆర్​ల కాంబినేషన్​లో ఓ మల్టీస్టారర్​ రానుందని చాలాసార్లు వార్తలు వచ్చాయి. కానీ ఏదీ కార్యరూపం దాల్చలేదు. అయితే దీనిపై తాజాగా బాలయ్య ఓ ఇంటర్వ్యూలో స్పందించారు.

బాలయ్య
బాలయ్య
author img

By

Published : Jun 2, 2020, 8:25 PM IST

నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్‌ కలిసి ఓ మల్టీస్టారర్‌ చేస్తే చూడాలనేది ఆయన అభిమానుల కోరిక మాత్రమే కాదు.. సినీప్రియుల ఆశ కూడా. వీళ్లిద్దరి కలయికలో నందమూరి కల్యాణ్‌ రామ్‌ ఓ సినిమా పట్టాలెక్కిస్తారని చాలా సార్లు ప్రచారం జరిగింది. కానీ, ఏదీ కార్యరూపం దాల్చలేదు.

తాజాగా ఈ క్రేజీ మల్టీస్టారర్‌పై బాలకృష్ణ ఓ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. తన బిడ్డతో కలిసి నటించడానికి తానెప్పుడూ సిద్ధమే అని చెప్పారు. "మంచి కథ దొరికితే జూనియర్ ఎన్టీఆర్​తో చేయడానికి ఎప్పుడూ సిద్ధమే. అది 'షోలే'లా చాలా భారీ స్థాయిలో ఉండాలి. అలాంటి కథ కోసం మేమూ ఎదురు చూస్తున్నాం. గతంలో ఇద్దరు, ముగ్గురు మా కోసం కథలు చెప్పారు కానీ, ఏదీ వర్కవుట్‌ కాలేదు. భవిష్యత్‌లోనైనా కుదురుతుందేమో చూడాలి" అన్నారు బాలయ్య.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.