ETV Bharat / sitara

బోయపాటి సినిమాలో శక్తిమంతంగా బాలయ్య పాత్ర! - బోయపాటి శ్రీను

నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబినేషన్​లో హ్యాట్రిక్​ చిత్రం తెరకెక్కుతోంది. గత రెండు చిత్రాల మాదిరిగానే బాలయ్యను రెండు విభిన్న పాత్రల్లో తెరపై చూపించడానికి దర్శకుడు సన్నాహాలు చేస్తున్నారట. ఈ సినిమాలో బాలయ్య పాత్రల కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని టాలీవుడ్​లో ప్రచారం జరుగుతుంది.

Balakrishna - Boyapati Srinu new movie update
బోయపాటి సినిమాలో శక్తిమంతంగా బాలయ్య పాత్ర!
author img

By

Published : Jul 20, 2020, 7:35 AM IST

బాలకృష్ణ - బోయపాటి శ్రీను... ఈ కలయిక ప్రత్యేకమైనది. ముచ్చటగా మూడోసారి వీరి కలయికలో సినిమాకి రంగం సిద్ధమైంది. 'సింహా', 'లెజెండ్'‌...సినిమాల్లో బాలకృష్ణ రెండో కోణం ప్రేక్షకుల్ని అలరించింది. ఆ పాత్రల్లోని బలం, భావోద్వేగాలు ప్రేక్షకులతో చప్పట్లు కొట్టించాయి. మూడో సినిమాలోనూ బాలకృష్ణ రెండో అవతారమే శక్తిమంతంగా నిలవనుంది.

ఈ విషయంపై దర్శకుడు బోయపాటి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని సినిమాలో బాలయ్య పాత్రని తీర్చిదిద్దుతున్నారు. ఈ సినిమాలో బాలకృష్ణ అఘోరాగా కనిపించనున్నారని ప్రచారం జరుగుతుంది. ఆ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నట్టు సమాచారం. ఇప్పటికే విడుదలైన టీజర్‌ ప్రేక్షకుల్లో అంచనాల్ని పెంచింది. ఈ సినిమా చిత్రీకరణని ఆగస్టులో కానీ, సెప్టెంబరులో కానీ పునః ప్రారంభించే అవకాశాలున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.