సల్మాన్‌ఖాన్ 'దబాంగ్ 3'.. డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని చెప్పాడు నిర్మాత అర్భాజ్ ఖాన్. ప్రస్తుతం 60 శాతం షూటింగ్ పూర్తయిందని.. సెప్టెంబర్ చివరికి నిర్మాణ పనులు పూర్తవుతాయని వివరించాడు. ప్రేక్షకుల అంచనాలకు అనుగుణంగా చిత్రం తీయటానికి ప్రయత్నిస్తామని చెప్పాడు.
"మేము మా వంతు కృషి చేస్తున్నాం. ప్రేక్షకుల్ని అలరించటానికి ప్రయత్నిస్తున్నాం. అభిమానులు సినిమాను ఇష్టపడతారని ఆశిస్తున్నాం. చిత్రంపై పూర్తి నమ్మకంగా ఉన్నాం." -అర్భాజ్ ఖాన్, నిర్మాత
ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్నాడు. సోనాక్షి సిన్హా మరోసారి రజ్జోగా, కన్నడ స్టార్ సుదీప్ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తోంది.
అర్భాజ్ ఖాన్.. 2010 లో వచ్చిన 'దబాంగ్'తో నిర్మాతగా మారాడు. 2012 వచ్చిన 'దబాంగ్ 2' కు దర్శక, నిర్మాతగా బాధ్యతలు నిర్వర్తించాడు. ఈ రెండు చిత్రాలు భారీ విజయాల్ని సొంతం చేసుకున్నాయి. ఇప్పుడు 'దబాంగ్ 3'తో మరోసారి హిట్ కొట్టేందుకు సిద్ధమవుతున్నాడు.
ఇది చదవండి: ముంబయి పేలుళ్ల సూత్రధారి సయీద్ అరెస్ట్