ETV Bharat / sitara

ప్రభాస్​తో బంధంపై అనుష్క ఏమందంటే?

author img

By

Published : Mar 15, 2020, 5:15 PM IST

'మిస్‌ పర్‌ఫెక్ట్‌' అనిపించుకుంటున్న అందాల భామ అనుష్క... తనపెళ్లి పై వస్తోన్న వదంతులకు ఫుల్​స్టాప్​ పెట్టింది. ప్రభాస్​తో తనకున్న బంధంపై తాజాగా స్పష్టత ఇచ్చిందీ ముద్దుగుమ్మ.

anushka
ప్రభాస్​తో ఉన్న బంధంపై అనుష్క ఏమందంటే?

టాలీవుడ్​లో మోస్ట్​ బ్యాచిలర్​ హీరోయిన్​ అంటే టక్కున గుర్తొచ్చేది అనుష్క. అందం, చక్కటి ఆహార్యం, మెప్పించే అభినయంతో సినీ ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. అలాంటి ఈ భామ పెళ్లిపై అందరికీ ఆసక్తి ఎక్కువే. తను హీరో ప్రభాస్​తో డేటింగ్​లో ఉన్నట్లు, ఇద్దరూ పెళ్లి చేసుకోనున్నట్లు వార్తలు ఎంతో కాలం నుంచి చక్కర్లు కొడుతున్నాయి. ప్రభాస్​ మాత్రమే కాదు ఓ టీమిండియా క్రికెటర్​, ​ప్రముఖ దర్శకుడి కుమారుడితో పెళ్లి అని అనేక వదంతులు హల్​చల్​ చేశాయి. ఈ వార్తలను పలుసార్లు ఖండించి అనుష్క... తాజాగా తనకు హీరో ప్రభాస్​కు మధ్య ఉన్న బంధంపై స్పష్టత ఇచ్చింది.

"గత పదిహేనేళ్లుగా ప్రభాస్‌ నాకు తెలుసు. మేమిద్దరం కలిసి 2009లో తొలిసారి 'బిల్లా' చిత్రం కోసం పనిచేశాము. తర్వాత 'మిర్చి', 'బాహుబలి' సినిమాలతో వెండితెర సూపర్‌హిట్‌ జోడి అనిపించుకున్నాము. ఈ క్రమంలో మా మధ్య మంచి స్నేహం ఏర్పడింది. నా 3 ఏఎమ్​ స్నేహితులలో అతడు ఒకడు (ఆ సమయంలోనైనా మాట్లాడగలిగేంత చనువు ఉందని అర్థం). మా ఇద్దరికీ ఇంకా పెళ్లి కాలేదు కనుక, స్క్రీన్‌పై మా జంట అద్భుతంగా ఉంటుంది. అందుకే మా మధ్య ప్రేమ ఉందని వదంతులు సృష్టించారు కొంతమంది. ఇద్దరి మధ్య ఏమైనా ఉండుంటే ఎప్పుడో చెప్పేవాళ్లం. మా ఇద్దరి వ్యక్తిత్వాలు ఒక్కటే. భావోద్వేగాల్ని దాచుకోలేం"

-అనుష్క, కథానాయిక.

తన పెళ్లిపై అందరికీ అంత ఆసక్తి ఎందుకని ప్రశ్నించింది అనుష్క. ఇలాంటి వదంతులు తన కుటుంబ సభ్యుల్ని బాధిస్తాయని అసహనం వ్యక్తం చేసింది.

anushka
అనుష్క ప్రభాస్​ సెల్ఫీ

'భాగమతి' హిట్‌ తర్వాత 'నిశ్శబ్దం'లో నటించిందీ భామ. ఈ సినిమాను ఏప్రిల్‌ 2న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. హేమంత్‌ మధుకర్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో.. షాలినీ పాండే, అంజలి, సుబ్బరాజు, మాధవన్‌ కీలక పాత్రలు పోషించారు.

anushka
'నిశ్శబ్దం'లో అనుష్క

ఇదీ చూడండి : ముద్దుగుమ్మ అనుష్క పాటించే 12 సూత్రాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.