ETV Bharat / sitara

'సంగీత దర్శకుడిగా అంతకంటే ఏం కావాలి?'

యాంకర్ ప్రదీప్ మాచిరాజు, అమృతా అయ్యర్ జంటగా నటించిన చిత్రం '30 రోజుల్లో ప్రేమించడం ఎలా'. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. ఈ సినిమా ఈనెల 29న విడుదలవబోతున్న నేపథ్యంలో అనూప్ విలేకర్లతో ముచ్చటించారు. ఆ విశేషాలు ఇవి.

Anup Rubens about 30 Rojullo Preminchadam Ela movie
'సంగీత దర్శకుడిగా అంతకంటే ఏం కావాలి'
author img

By

Published : Jan 26, 2021, 7:24 AM IST

అనూప్ రూబెన్స్

"ఒక పాట ప్రేక్షకుల్ని థియేటర్లకి తీసుకొస్తుందనే విషయాన్ని చాలా ఇష్టపడతా. సినిమాకి నా పాట ప్రధాన ఆకర్షణగా నిలిచిందంటే ఒక సంగీత దర్శకుడిగా నాకు అంతకంటే ఏం కావాలి?" అంటున్నారు అనూప్‌ రూబెన్స్‌. ఆయన స్వరాలు సమకూర్చిన చిత్రం '30 రోజుల్లో ప్రేమించటం ఎలా?'. ప్రదీప్‌ మాచిరాజు, అమృత అయ్యర్‌ జంటగా నటించారు. మున్నా దర్శకుడు. ఎస్‌.వి.బాబు నిర్మాత. ఈ నెల 29న చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తున్న సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు అనూప్‌ రూబెన్స్‌. ఆ విషయాలివీ..

"పాటంత బాగుంటుంది సినిమా అనే శీర్షికతో మా సినిమా ప్రేక్షకుల ముందుకొస్తుండడం ఎంతో సంతృప్తినిస్తోంది. 'నీలి నీలి ఆకాశం..' పాట బాణీనీ దర్శకుడు చెప్పిన సందర్భం, అందులోని భావోద్వేగాలు ఇచ్చిన స్ఫూర్తితోనే సమకూర్చా. సామాజిక మాధ్యమాల వల్ల ఒక పాట ఇంతగా శ్రోతలకి చేరువవుతుందని ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఈ సినిమా కోసం నేను కట్టిన తొలి బాణీ.. 'నీలి నీలి ఆకాశమే'. రెండు రకాల బాణీలు చేసి వినిపించాను కానీ.. మా బృందంలో అందరూ నీలి నీలినే బాగుందని చెప్పారు. నాకు గీత రచయిత చంద్రబోస్‌ అంటే ఇష్టం. ఈ బాణీ సిద్ధమయ్యాక ఆయనే గుర్తుకొచ్చారు. ఆయన హృదయాల్ని హత్తుకునేలా పాట ఇచ్చారు. చంద్రబోస్‌ నాలుగు పాటలు, అనంత శ్రీరామ్‌ ఒక పాట, నేను, ప్రదీప్‌ కలిసి ఓ పాట రాశాం".

"ప్రదీప్‌, నేను మంచి స్నేహితులం. నేను చేసిన కొన్ని షోలకి ప్రదీప్‌ యాంకరింగ్‌ చేశాడు. మున్నా తన తొలి సినిమాని నాతోనే చేయాలనుకున్నాడట. ప్రదీప్‌కి ఆ విషయం చెప్పాక తను నా దగ్గరికి వచ్చి 'నేను అడుగుతున్నానని కాదు, కథ నచ్చితేనే చెయ్యి' అన్నాడు. మున్నా కథ చెప్పగానే మంచి సినిమా చేస్తున్నామనే అనుభూతి కలిగింది. ఈ సినిమా చూస్తూ ప్రేక్షకులు నవ్వుతారు, ఏడుస్తారు. మన చుట్టూ ఏదైనా మంచి జరిగితే సంతృప్తి కలుగుతుంది కదా, అలాంటి అనుభూతితో ప్రేక్షకుడు బయటికొస్తాడు. ప్రదీప్‌ కామెడీతో పాటు, మంచి భావోద్వేగాల్ని పలికించాడు. నిర్మాత ఎస్‌.వి.బాబు సినిమాకి ఏం కావాలో అవి పక్కాగా సమకూర్చారు. ఆయన నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కడంతోనే థియేటర్లలో చూసుకోగలుగుతున్నాం".

"మెలోడీ అంటే నాకు ఇష్టం. 'టెంపర్‌', 'సోగ్గాడే చిన్ని నాయనా' చిత్రాల తర్వాత 'అనూప్‌ నుంచి ఈ తరహా సంగీతం ఊహించలేదు' అన్నారు. అవకాశం వస్తే ఏ తరహా కథైనా అత్యుత్తమమైన పనితీరుని ప్రదర్శించొచ్చు. 'కాటమరాయుడు', 'గోపాల గోపాల', 'పైసా వసూల్‌' తదితర సినిమాల్లో సంగీతం నాకు మంచి పేరునే తీసుకొచ్చింది. ప్రస్తుతం 'కోతికొమ్మచ్చి', 'ఓదెల రైల్వే స్టేషన్‌' తదితర సినిమాలకి సంగీతం అందిస్తున్నా".

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.