ETV Bharat / sitara

ఆ సినిమాలో చిరుతో పాటు మరో హీరో ఎవరు? - chiranjeevi news latest

మెగాస్టార్​ చిరంజీవి హీరోగా, బాబీ దర్శకత్వంలో మల్టీస్టారర్​ చిత్రం తెరకెక్కనుంది. ఇందులో చిరుతో పాటు నటించే హీరో ఎవరన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

megastar chiranjeevi
చిరు
author img

By

Published : Aug 11, 2020, 8:24 AM IST

Updated : Aug 11, 2020, 2:36 PM IST

మెగాస్టార్​ చిరంజీవి కోసం వరుసగా మల్టీస్టారర్‌ కథలే సిద్ధమవుతున్నాయి. ఆ కథల్ని విని చిరు కూడా ఓకే చెప్పేస్తున్నాడు. ప్రస్తుతం మెగాస్టార్​ చేస్తున్న ఆచార్య మల్టీస్టారర్‌లోనే తెరకెక్కుతోంది. అందులో చిరుతో పాటు ఆయన తనయుడు రామ్‌చరణ్‌ కూడా నటిస్తున్నాడు.

లూసిఫర్ రీమేక్‌నూ మల్టీస్టారర్‌ నేపథ్యంలోనే రూపొందిస్తున్నారు. మలయాళంలో విజయవంతమైన ఆ చిత్రాన్ని చూసి తన తండ్రి కోసం హక్కుల్ని సొంతం చేసుకున్నాడు చరణ్‌. ఈ రెండింటితో పాటు బాబీ దర్శకత్వంలో చేయబోతున్న చిత్రం కూడా మల్టీస్టారర్‌ కథతోనే తెరకెక్కబోతోంది. అందులో చిరుతో కలిసి నటించబోయే మరో హీరో ఎవరన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఇప్పటికే ఆ విషయంపై దర్శకుడు కె.ఎస్‌.రవీంద్ర (బాబీ) కసరత్తులు చేస్తున్నట్టు సమాచారం. మెగా కుటుంబంలోనే పలువురు కథానాయకులు ఉన్నారు. మరి వాళ్లలోని ఒకరు చిరుతో కలిసి నటిస్తారా లేక బయటి హీరోని ఎంపిక చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మించబోతోంది. ఇప్పటికే చిరు స్క్రిప్టుని పక్కా చేసేశారు. 'ఆచార్య' తర్వాత ఈ చిత్రమే పట్టాలెక్కే అవకాశాలున్నాయి.

Last Updated : Aug 11, 2020, 2:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.