ETV Bharat / sitara

సుశాంత్ క్లాస్ట్రోఫోబికా.. ఇది చూడు రియా!

author img

By

Published : Aug 28, 2020, 9:49 AM IST

సుశాంత్ సింగ్​కు క్లాస్ట్రోఫోబియా ఉందంటూ రియా చేసిన వ్యాఖ్యల్ని ఖండించింది అంకితా లోఖండే. అప్పట్లో సుశాంత్ ఫ్లైట్ నడుపుతున్న వీడియోను షేర్ చేసిన అంకిత.. రియా చేసిన ఆరోపణలో అర్థం లేదని తెలిపింది.

సుశాంత్ క్లాస్ట్రోఫోబికా.. ఇది చూడు రియా!
సుశాంత్ క్లాస్ట్రోఫోబికా.. ఇది చూడు రియా!

ఓ మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సుశాంత్ సింగ్ రాజ్​పుత్​కు క్లాస్ట్రోఫోబియా (పరిమిత ప్రదేశాల్లో భయపడటం) సమస్య ఉందని రియా చక్రవర్తి ఆరోపించింది. ఒకసారి ఫ్లైట్​లో ఉన్నపుడు సుశాంత్ భయపడ్డట్లు తెలిపింది. అయితే ఈ వ్యాఖ్యల్ని ఖండించింది సుశాంత్ మాజీ ప్రేయసి అంకితా లోఖండే. అతడికి సంబంధించిన ఓ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్న అంకిత "ఇది చూస్తే సుశాంత్​కు క్లాస్ట్రోఫోబియా ఉందని అనిపిస్తోందా" అంటూ ప్రశ్నించింది.

ఈ వీడియోలో సుశాంత్ ఫ్లైట్​ నడపడం నేర్చుకుంటూ కనిపిస్తున్నాడు. సుశాంత్​కు సంబంధించిన మరో ట్వీట్​ను రీట్వీట్ చేసింది అంకిత. దీనికి తన 50 కలల్లో మొదటిది అంటూ క్యాప్షన్ ఇచ్చాడు సుశాంత్.

Dream 1/50
Learn to Fly. ✈️ #livingMyDreams #lovingMyDreams pic.twitter.com/TPvbPDWd99

— Sushant Singh Rajput (@itsSSR) September 26, 2019 ">

అలాగే సుశాంత్​ ఎప్పుడూ సైకియాట్రిస్ట్​ను కలవలేదని స్పష్టం చేసింది అంకిత. తామిద్దరం కలిసున్నపుడు అతడికి అలాంటి సమస్యలేవీ లేవని తెలిపింది.

సుశాంత్ మృతి కేసులో సీబీఐ, మ‌నీ ల్యాండ‌రింగ్ కేసులో ఈడీ, నిషేధిత మాద‌క ద్ర‌వ్యాల కేసులో ఎన్‌సీబీ (నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో‌) రియాను విచారిస్తున్నాయి.

ఓ మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సుశాంత్ సింగ్ రాజ్​పుత్​కు క్లాస్ట్రోఫోబియా (పరిమిత ప్రదేశాల్లో భయపడటం) సమస్య ఉందని రియా చక్రవర్తి ఆరోపించింది. ఒకసారి ఫ్లైట్​లో ఉన్నపుడు సుశాంత్ భయపడ్డట్లు తెలిపింది. అయితే ఈ వ్యాఖ్యల్ని ఖండించింది సుశాంత్ మాజీ ప్రేయసి అంకితా లోఖండే. అతడికి సంబంధించిన ఓ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్న అంకిత "ఇది చూస్తే సుశాంత్​కు క్లాస్ట్రోఫోబియా ఉందని అనిపిస్తోందా" అంటూ ప్రశ్నించింది.

ఈ వీడియోలో సుశాంత్ ఫ్లైట్​ నడపడం నేర్చుకుంటూ కనిపిస్తున్నాడు. సుశాంత్​కు సంబంధించిన మరో ట్వీట్​ను రీట్వీట్ చేసింది అంకిత. దీనికి తన 50 కలల్లో మొదటిది అంటూ క్యాప్షన్ ఇచ్చాడు సుశాంత్.

అలాగే సుశాంత్​ ఎప్పుడూ సైకియాట్రిస్ట్​ను కలవలేదని స్పష్టం చేసింది అంకిత. తామిద్దరం కలిసున్నపుడు అతడికి అలాంటి సమస్యలేవీ లేవని తెలిపింది.

సుశాంత్ మృతి కేసులో సీబీఐ, మ‌నీ ల్యాండ‌రింగ్ కేసులో ఈడీ, నిషేధిత మాద‌క ద్ర‌వ్యాల కేసులో ఎన్‌సీబీ (నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో‌) రియాను విచారిస్తున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.