'జర్నీ','సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు','డిక్టేటర్','బలుపు' లాంటి చిత్రాలతో అలరించిన తెలుగింటి అమ్మాయి అంజలి. దక్షిణాదిన అన్ని భాషల సినిమాల్లోనూ అలరించింది. తాజాగా ఈ అమ్మడుకు మరో ఆఫర్ వచ్చింది. కన్నడలో శివరాజ్ కుమార్ కథానాయకుడిగా నటిస్తున్న 'శివప్ప' చిత్రంలో కథానాయికగా ఎంపికైంది. ఇందులో శివరాజ్ కుమార్ మూడు విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నారు. విజయ్ మిల్టన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో.. పృథ్వీ అంబార్, ధనంజయ్, శశి కుమార్, సినీయర్ నటి ఉమాశ్రీ కనువిందు చేయనుంది. ఈనెల 23వ తేదీన చిత్రీకరణ ప్రారంభం కానుంది.
యాక్షన్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి అనూప్ సీలిన్ సంగీతం స్వరాలు అందిస్తున్నారు. ప్రస్తుతం అంజలి తెలుగులో 'ఆనందభైరవి', పవన్‌కల్యాణ్ సరసన 'వకీల్‌సాబ్' చిత్రాల్లో నటిస్తోంది.