ETV Bharat / sitara

'అంధాధున్​' రీమేక్​​ అప్​డేట్​.. 'చిట్టీ' వీడియో సాంగ్​ - జాతిరత్నాలు చిట్టీ వీడియో సాంగ్

కొత్త సినిమా అప్​డేట్స్​ వచ్చేశాయి. 'అంధాధున్'​ తెలుగు రీమేక్​ టైటిల్​, ఫస్ట్​లుక్​ అప్​డేట్​.. 'చిట్టీ' వీడియో సాంగ్​తో పాటు 'లవ్​స్టోరి', 'ఏక్​ మినీ కథ' సినిమా కబుర్లు ఇందులో ఉన్నాయి.

chitti video song, andhadhun remake update
'చిట్టీ' వీడియో సాంగ్​
author img

By

Published : Mar 29, 2021, 7:03 PM IST

Updated : Mar 29, 2021, 7:51 PM IST

'అంధాధున్​' తెలుగు రీమేక్​లో నితిన్​, నభా నటాష్​, తమన్నా ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. మంగళవారం నితిన్​ పుట్టినరోజు సందర్భంగా చిత్ర టైటిల్​తో పాటు ఫస్ట్​లుక్​ను రాత్రి 12 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తుండగా.. శ్రేష్ఠ్​ మూవీస్​ పతాకంపై నికితా రెడ్డి, సుధాకర్​ రెడ్డి నిర్మిస్తున్నారు.

chitti video song, andhadhun remake update
నితిన్​ 'అంధాదున్​' రీమేక్​ ఫస్ట్​లుక్​, టైటిల్​ అప్​డేట్​

నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తోన్న 'లవ్​స్టోరి' చిత్రంలోని సారంగదరియా పాట యూట్యూబ్​లో సరికొత్త రికార్డును సృష్టించింది. అత్యంత వేగంగా వంద మిలియన్ల లైకులు దక్కించుకున్న తొలి దక్షిణాది పాటగా ఈ వీడియో ఘనత సాధించింది.

'లవ్​స్టోరి' సారంగదరియా మిలియన్​ లైక్​లు

సంతోష్​ శోభన్, కావ్య తాపర్ జంటగా నటించిన చిత్రం 'ఏక్ మినీ కథ'. కార్తీక్ రాపోలు దర్శకత్వంలో మేర్లపాక గాంధీ కథ అందించిన ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ నిర్మించింది. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకురానుంది. హోలీ పండుగ సందర్భంగా యూవీ క్రియేషన్స్​ కార్యాలయంలో పలువురు యూట్యూబర్లతో సంతోష్, కావ్యలు రంగోళి ఆడారు. రంగులు చల్లుకుంటూ సినిమాలోని పాటలకు నృత్యాలు చేస్తూ సందడి చేశారు.

'ఏక్​ మినీ కథ' హోలీ సెలబ్రేషన్స్​

యువ కథానాయకుడు నవీన్​ పొలిశెట్టి హీరోగా ప్రియదర్శి, రాహుల్​ రామకృష్ణ ప్రధానపాత్రల్లో నటించిన చిత్రం 'జాతిరత్నాలు'. అనుదీప్​ కేవీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి నాగ్​ అశ్విన్ నిర్మాతగా వ్యవహరించారు. మహా శివరాత్రి సందర్భంగా థియేటర్లలో విడుదలైన సినిమా.. విశేష ప్రేక్షకాదరణ దక్కించుకుంది. ఈ నేపథ్యంలోని చిత్రంలోని సూపర్​డూపర్​ హిట్​గా నిలిచిన 'చిట్టీ' వీడియో సాంగ్​ను సోమవారం చిత్రబృందం విడుదల చేసింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: బీబీ3 అప్​డేట్​: కలెక్టర్​తో బాలయ్య ప్రేమాయణం!

Last Updated : Mar 29, 2021, 7:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.