ETV Bharat / sitara

ఒక్క రూపాయి దానం చేసినా చాలు: యాంకర్ రష్మి

'జబర్దస్త్' యాంకర్ రష్మి.. సాయం చేయాలని తన ఇన్​స్టా ఫాలోవర్లను అభ్యర్ధించింది. ఒక్కో అభిమాని కనీసం రూపాయి దానం చేసినా చాలని పేర్కొంది.

anchor rashmi
యాంకర్ రష్మి
author img

By

Published : Aug 18, 2021, 8:27 AM IST

మూగజీవాలకు ఏదైనా ప్రమాదం జరిగితే నటి, బుల్లితెర వ్యాఖ్యాత రష్మి చలించిపోతుంది. ఎక్కడ.. ఏ జంతువుకి హాని జరిగినా వెంటనే స్పందిస్తుంది. ఇటీవల ఇషాన్‌ అనే కుక్క గాయపడగా దాన్ని చూసి కలత చెందిన ఆమె, చికిత్స కోసం దానం చేయండంటూ సామాజిక మాధ్యమాల వేదికగా తన అభిమానుల్ని అభ్యర్థించింది.

anchor rashmi
యాంకర్ రష్మి

'నెల క్రితం ఓ కన్‌స్ట్రక్షన్‌ సైట్‌లో ఇషాన్‌ అనే కుక్క ఆరో అంతస్తు నుంచి కిందకి పడిపోవడం వల్ల తీవ్ర గాయాలయ్యాయి. అప్పటి నుంచి దాని చికిత్సకు రోజుకు రూ.300-400 ఖర్చవుతుంది. అది తిరిగి నడిచేందుకు ఇంకాస్త సమయం పడుతుంది. నా వంతు సాయం నేను చేస్తున్నా. మీరూ చేస్తారని ఆశిస్తున్నా. ప్లీజ్‌ మీకు తోచినంత సాయం చేయండి. ఇన్‌స్టాగ్రామ్‌లో నన్ను అనుసరిస్తున్న వారు 3.7 (3,77,800) మిలియన్‌కు పైగానే ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్క రూపాయి దానం చేసినా చాలు. అందరం కలిసి సాయం చేద్దాం' అని రష్మి కోరింది. డొనేట్‌ చేసే లింక్‌ను తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్‌ చేసింది. చికిత్స పూర్తయిన తర్వాత ఇషాన్‌ను అలా వదిలేయకుండా తగిన చర్యలు తీసుకోనున్నట్టు తెలిపింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో శునకాలకు ఏబీసీ (యానిమల్‌ బర్త్‌ కంట్రోల్‌) ఆపరేషన్‌ చేసి, వాటిని అలాగే వదిలేస్తున్నారని, దీనికి పరిష్కార చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్‌ను ఇటీవల ట్విటర్‌ వేదికగా ఈమె కోరింది.

.
.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.