ETV Bharat / sitara

అప్పుడు 'రంగమ్మత్త'.. మరి ఇప్పుడు? - అనసూయ అల్లు అర్జున్

'పుష్ప'లో నటి అనసూయ కీలక పాత్ర పోషిస్తోంది. ఆ విషయాన్నే చెబుతూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. ఈ ఏడాది ఆగస్టు 13న సినిమా థియేటర్లలోకి రానుంది.

anasuya in pushpa
అనసూయ
author img

By

Published : Apr 22, 2021, 6:22 AM IST

'రంగస్థలం' సినిమా కోసం అనసూయను రంగమ్మత్తగా మార్చేశారు దర్శకుడు సుకుమార్‌. ఆ పాత్ర ఆమెకు ఎంతో పేరు తెచ్చిపెట్టింది. ఇప్పుడు మరోసారి అనసూయ కోసం సుకుమార్‌ ఓ కీలక పాత్రను సృష్టించినట్టు తెలుస్తోంది.

ఆయన ప్రస్తుతం అల్లు అర్జున్‌ కథానాయకుడిగా 'పుష్ప' తెరకెక్కిస్తున్నారు. ఇందులో అనసూయ ఓ కీలక పాత్ర చేస్తోంది. బుధవారం ఆమెపై కొన్ని కీలక సన్నివేశాల్ని తీశారు. ఈ మేరకు ఆమె ఓ క్లాప్‌ పట్టుకొన్న ఫొటోను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది. 'రంగస్థలం'లో రంగమ్మత్తగా కనిపించిన అనసూయ.. ఈసారి ఎలాంటి పాత్రతో సందడి చేస్తుందనేది చూడాలి.

anasuya in allu arjun pushpa movie
అనసూయ ఇన్​స్టా పోస్ట్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.