రంగమ్మత్తగా ‘రంగస్థలం’లో అనసూయ నటనను మర్చిపోలేం. తన ఆహార్యం, హావభావాలు ప్రేక్షకుల్ని కట్టిపడేశాయి. ఆ పాత్ర ఆమెకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. మళ్లీ ఇప్పుడు మరో వైవిధ్యమైన పాత్రలో కనిపించబోతుంది అనసూయ.
ప్రకాశ్‌రాజ్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న చిత్రం ‘రంగమార్తాండ’. గతంలో అనసూయ ఈ చిత్రంలో నటిస్తుందని వార్తలొచ్చాయి కానీ అధికారిక ప్రకటన లేదు. తాజాగా దర్శకుడు కృష్ణవంశీ అనసూయ ఫొటోను షేర్ చేస్తూ ఆమెను ఉద్దేశించి వ్యాఖ్యను జోడించడం వల్ల స్పష్టత వచ్చింది.
"ఎప్పుడూ నవ్వుతూ ఉండే అనసూయతో పనిచేయడం సంతోషంగా ఉంది. అనసూయ ఓ స్పైసీ పాత్రలో కనిపించబోతుంది" అని ట్వీట్ చేశాడు వంశీ. ఇందులో ఆమె చేతినిండా గాజులు, ఆభరణాలు ధరించి చీరలో దర్శనమిచ్చింది. రంగమార్తాండుడి వివాహ మహోత్సవ సన్నివేశంలో ఫొటో ఇది. ‘రంగస్థలం’లోనూ పూర్తిగా చీరలోనే కనిపించింది అనసూయ. అప్పుడు రంగమ్మత్తలా కనిపించిన అనసూయ ఇప్పుడు ‘రంగమార్తాండ’లో ఎలాంటి పాత్ర పోషిస్తుందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.
-
Happy to work with the sensuous sensation ,sparkling, always smiling amazingANASUYA in a spicey role ...# RANGAMAARTHANDA pic.twitter.com/OIKJ90AN0F
— Krishna Vamsi (@director_kv) December 17, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Happy to work with the sensuous sensation ,sparkling, always smiling amazingANASUYA in a spicey role ...# RANGAMAARTHANDA pic.twitter.com/OIKJ90AN0F
— Krishna Vamsi (@director_kv) December 17, 2019Happy to work with the sensuous sensation ,sparkling, always smiling amazingANASUYA in a spicey role ...# RANGAMAARTHANDA pic.twitter.com/OIKJ90AN0F
— Krishna Vamsi (@director_kv) December 17, 2019
ఇవీ చూడండి.. ట్రైలర్: 'ప్రేమించట్లేదంటే నువ్వు నచ్చలేదని కాదు'