ETV Bharat / sitara

జీవితం కన్నా పరీక్షలు పెద్దవేం కావు: హీరో సూర్య - సూర్య నీట్ ఎగ్జామ్ వీడియో

తమిళనాడులో నీట్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకుని మృతిచెందడంపై హీరో సూర్య ఆవేదన వ్యక్తం చేశారు. జీవితం కంటే పరీక్షలు పెద్దవేం కాదని అన్నారు.

Actor Suriya Reaches Out To NEET Aspirants
హీరో సూర్య
author img

By

Published : Sep 19, 2021, 1:13 PM IST

'నాకు ఏ విషయంలోనూ భయం లేదు' అని తమిళ కవి సుబ్రహ్మణ్య భారతి చెప్పినట్లు విద్యార్థులందరూ భయం లేకుండా, దృఢ విశ్వాసంతో జీవించాలని నటుడు సూర్య(suriya movies) విజ్ఞప్తి చేశారు. జాతీయ అర్హత పరీక్ష(నీట్‌)కు(neet 2021) హాజరయ్యే ముగ్గురు విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురై ఇటీవల ఆత్మహత్య చేసుకున్నారు. ఈ వరుస ఘటనలు అందరినీ కలిచివేశాయి. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ విచారం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో నటుడు సూర్య ప్రత్యేక వీడియో పోస్ట్ చేశారు. ఒక సోదరుడిగా విజ్ఞప్తి చేస్తున్నానని భావోద్వేగంతో మాట్లాడారు.

"పరీక్ష అనేది జీవితం కన్నా పెద్దదేమీ కాదు. మీరు డిప్రెషన్‌లో ఉంటే, వెంటనే మీ సన్నిహితులతో ఎక్కువ సేపు గడపండి. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, స్నేహితులు ఇలా ఎవరైనా సరే. ఒత్తిడి, నిరాశ, నిస్పృహలనేవి కొద్దిసేపటి తర్వాత తొలగిపోతాయి. కానీ, ఆత్మహత్య చేసుకోవాలన్న నిర్ణయం మీ జీవితాన్నే ముగించేస్తుంది. మిమ్మల్ని అమితంగా ప్రేమించే తల్లిదండ్రులకు అది యావజ్జీవ శిక్షలాంటిది. దీన్ని మర్చిపోవద్దు. ఒక సోదరుడిగా ఈ విషయం చెబుతున్నా" అని తీవ్ర ఒత్తిడితో బాధపడుతున్న విద్యార్థులను ఉద్దేశించి విజ్ఞప్తి చేశారు.

చదువులో తానేమీ మెరిట్‌ విద్యార్థిని కాదన్న సూర్య(suriya movies).. "నేను హాజరైన అన్ని పరీక్షల్లో ఫెయిల్‌ అయ్యాను. చాలా తక్కువ మార్కులు వచ్చేవి. జీవితంలో కేవలం మార్కులు, పరీక్షలు మాత్రమే ఉండవు. అంతకు మించి ఎన్నో సాధించాలి. మిమ్మల్ని అర్థం చేసుకుని ప్రేమించే వాళ్లు చాలా మంది ఉన్నారు. దృఢ సంకల్పం, ధైర్యం ఉన్న ప్రతి ఒక్కరూ ఏదైనా గెలవగలరు. ఉన్నత స్థానాలకు చేరగలరు" అని సూర్య చెప్పుకొచ్చారు.

నీట్‌ పరీక్షకు(neet 2021 result date) హాజరు కావాల్సిన ముగ్గురు విద్యార్థులు ధనుష్‌, కనిమొళి, సౌందర్య భయంతో గత వారం ఆత్మహత్య చేసుకున్నారు. 2017 నుంచి ఇలా 17మంది విద్యార్థులు తమ జీవితాలను అర్థాంతరంగా ముగించారు. కాగా, ధనుష్‌ ఆత్మహత్య ఘటనతో తమిళనాడు ప్రభుత్వం సంస్కరణలకు దిగింది. వైద్య కళాశాలల్లో ప్రవేశాలకు నీట్‌ అర్హత పరీక్షను బట్టి కాకుండా 12వ తరగతి మార్కుల ఆధారంగా సీట్లు కేటాయించేందుకు అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.