ప్రముఖ హీరో విశాల్ నటించిన 'యాక్షన్' చిత్రం విడుదలై ఆశించిన స్థాయిలో విజయం అందుకోలేకపోయంది. తదుపరి సినిమాతోనైనా హిట్టు కొట్టాలనే పట్టుదలతో ఉన్నాడు ఈ హీరో. ప్రస్తుతం మిష్కిన్ దర్శకత్వంలో 'తుప్పరివాళన్ 2' సినిమాలో నటిస్తున్నాడు. లండన్లో ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. తాజాగా 'అరిమానంబి', 'ఇరుముగన్' ఫేమ్ ఆనంద్ శంకర్ దర్శకత్వంలో పనిచేయనున్నాడు విశాల్.
ఈ సినిమాలో రితూవర్మ కథానాయికగా నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. విక్రమ్ హీరోగా తెరకెక్కిన 'ధ్రువ నక్షత్రం'లో రితూ నటించగా.. రెండేళ్లు దాటుతున్నా ఇప్పటికీ సినిమా విడుదల కాలేదు. మరోవైపు దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కుతున్న 'కన్నుం కన్నుం కొళ్లైయడిత్తాల్' చిత్రంలోనూ నటిస్తోందీ ముద్దుగుమ్మ. విశాల్ సరసన నటించనుండటం రితూకు ఇదే తొలిసారి. ప్రస్తుతం దర్శకుడు ఆనంద్ శంకర్ ఈ చిత్రంలోని ఇతర నటీనటులు, సాంకేతిక కళాకారుల ఎంపికలో బిజీగా ఉన్నట్లు సమాచారం.
ఇదీ చూడండి: 'యూపీ వాడికి తెలుగువాడు యముడిలా కనిపిస్తున్నాడా'