రెబల్‌స్టార్ ప్రభాస్, దర్శకుడు నాగ్ అశ్విన్ ఓ చిత్రం చేస్తున్నారు. ఈ ఏడాది డిసెంబరు నుంచి షూటింగ్ ప్రారంభం కానుంది. ఇందులో హీరోయిన్గా దీపికా పదుకొణె నటిస్తుండగా, అమితాబ్ బచ్చన్ కీలకపాత్ర చేస్తున్నారు. అయితే ఇందులో బిగ్ బీ కేవలం అతిథి పాత్రలోనే కనిపించనున్నారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో నిర్మాత ప్రియాంక దత్ స్పందించారు.
"సినిమాలో అమితాబ్‌ది కొద్దిసేపు ఉండిపోయే పాత్ర కాదు. పూర్తి నిడివి గల పాత్రే చేస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళం, మలయాళంలో చిత్రాన్ని విడుదల చేస్తాం. బిగ్ బీ పాత్రకు దక్షిణాది భాషల్లో వాయిస్ డబ్బింగ్ సమస్య ఉంది. ఆయనకు సరిపోయే గొంతు కోసం వెతుకుతున్నాం"
- ప్రియాంక దత్, నిర్మాత
వైజయంతీ మూవీస్ పతాకంపై నిర్మితమయ్యే ఈ పాన్ ఇండియా చిత్రానికి సంగీత దర్శకుడు ఎవరనేది ఇంకా ప్రకటన రాలేదు. కానీ ప్రముఖ సంగీత దర్శకుల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఈ సినిమాను 2022లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు నిర్మాణ సంస్థ సన్నాహాలు చేస్తుంది.
ఇది కాకుండా ప్రభాస్.. 'రాధేశ్యామ్' షూటింగ్లో బిజీగా ఉన్నారు. అలానే 'ఆదిపురుష్' సినిమా కూడా చేయాల్సి ఉంది. దీని చిత్రీకరణ వచ్చే ఏడాది ప్రారంభమవుతుంది.