ETV Bharat / sitara

ఎందుకు సుశాంత్ ఇలా చేశావు: అమితాబ్ - సుశాంత్ సింగ్ రాజ్​పుత్ మృతి

బాలీవుడ్ యువ నటుడు సుశాంత్​ సింగ్ రాజ్​పుత్ ఆత్మహత్య చేసుకోవడంపై విచారం వ్యక్తం చేశారు బాలీవుడ్ బిగ్​బీ అమితాబ్ బచ్చన్. అతను తీసుకున్న విపరీతమైన ఈ నిర్ణయం తీవ్రంగా కలచి వేసిందని వాపోయారు.

Amitabh Bachchan wrote emotional post on Sushant Singh Rajput death
సుశాంత్
author img

By

Published : Jun 15, 2020, 8:16 PM IST

బాలీవుడ్‌ యువ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య చేసుకోవడంపై యావత్‌ సినీ ప్రపంచం దిగ్భ్రాంతికి గురైంది. తమ సహ నటుడు లేడన్న వార్తను ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. సుశాంత్‌ మృతిపై బిగ్‌బీ అమితాబ్‌ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తన బ్లాగ్‌లో ఓ భావోద్వేగ పోస్ట్‌ చేశారు. అతను తీసుకున్న విపరీత చర్య తనని తీవ్రంగా కలచి వేసిందని వాపోయారు.

"ఎందుకు.. ఎందుకు.. ఎందుకు.. సుశాంత్‌ ఎందుకు నీ జీవితాన్ని త్యజించావు. నిన్ను నీవు ప్రశ్నించుకోకుండా, అడగకుండా నీ అద్భుతమైన ప్రతిభను, మేథాశక్తిని ఎందుకు పక్కన పెట్టావు. అతని పనితీరు అద్భుతం. ఒకసారి అతను నన్ను కలిసినప్పుడు 'అంతర్జాతీయ టోర్నమెంట్‌లో ధోని కొట్టిన విన్నింగ్‌ సిక్స్‌ను వెండితెరపై అదేవిధంగా ఎలా కొట్టగలిగావు' అని అడిగాను 'ధోని సిక్స్‌ కొట్టిన ఆ వీడియోను వందలసార్లు చూశాను' అని అతను నాతో చెప్పాడు. ఈ ఒక్క ఉదాహరణ చాలు వృత్తి పట్ల అతనికున్న నిబద్ధత తెలియజేయడానికి."

-అమితాబ్ బచ్చన్, ప్రముఖ హీరో

'ధోని' కోసం సుశాంత్ పడ్డ కష్టాన్ని తాను చూశానని, వస్త్రధారణ, ధోని జీవితంలో మర్చిపోలేని సంఘటనలు నటించే సమయంలో అతని నటన అద్భుతంగా ఉందని అమితాబ్‌ గుర్తు చేసుకున్నారు. అతను మాట్లాడే ప్రతి మాట వెనుక నిగూఢ అర్థం దాగి ఉండేదని చెప్పుకొచ్చారు. గ్రూప్‌ డ్యాన్సర్‌లలో నాలుగో స్థానం డ్యాన్సర్‌గా జీవితం ప్రారంభించిన సుశాంత్‌, కథానాయకుడిగా ఎదిగిన తీరు చూస్తుంటే అంతా ఒక నాటకం చూసినట్లే అనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. సినీ ప్రపంచంలో త్వరగా పైకి ఎదిగిన సుశాంత్‌ అంతే త్వరగా వెళ్లిపోవడం బాధాకరమన్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.