ETV Bharat / sitara

"మహిళా అభిమానులూ నా భార్యతో జాగ్రత్త" - అల్లు అర్జున్

ఈ ఏడాది సంక్రాంతికి 'అల..వైకుంఠపురంలో..' చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన అల్లు అర్జున్​... భారీ విజయాన్ని అందుకున్నాడు. ప్రస్తుతం సుకుమార్​ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు. తాజాగా అతడి జీవితంలో జరిగిన కొన్ని విశేషాలను అభిమానులతో పంచుకున్నాడీ స్టార్​ హీరో.

Amitabh-bachchan-is-my-inspiration-says-Allu-arjun
నా భార్య చాలా స్ట్రిక్ట్​: అల్లు అర్జున్​
author img

By

Published : Mar 11, 2020, 11:17 PM IST

తనకు 70ఏళ్లు వచ్చినా అమితాబ్‌ బచ్చన్‌లా సినిమాల్లోనే ఉండాలనుకుంటున్నట్లు మనసులో మాట చెప్పాడు స్టైలిష్‌ స్టార్‌ అల్లుఅర్జున్‌. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన 'అల వైకుంఠపురములో..' చిత్రం విజయంతో జోరు మీదున్నాడు బన్నీ. ప్రస్తుతం సుకుమార్‌ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నాడు. శేషాచలం అడవుల నేపథ్యంలో సాగే మాఫియా కథతో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు సమాచారం. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ఆ విషయాలు అతడి మాటల్లోనే...

ఒత్తిడి కూడా సంతోషమే

"మొదట్లో నాకు యానిమేటర్‌ కావాలని ఉండేది. కొద్దిరోజులకే దానిపై ఆసక్తి పోయింది. సినిమా నేపథ్యం ఉన్న కుటుంబంలో ఉన్నప్పుడు ఆ ఇంటి వాతావరణ ప్రభావం తప్పకుండా పడుతుంది కదా. నా విషయంలోనూ అంతే. అలా నేనూ హీరో అయ్యా. నా ప్రతి సినిమా కోసం సర్వశక్తులు ఒడ్డుతా. గత సినిమాలో నా ప్రదర్శన కంటే కొత్త సినిమాలో ఉత్తమంగా చేయాలనుకుంటా. నేను ఎంతవరకు చేయగలనో అంతవరకూ తప్పకుండా ప్రయత్నిస్తా. ఒత్తిడి తీసుకోవడం ఒక రకమైన సంతోషమే. రోజంతా కష్టపడి పనిచేస్తే, ఒక నటుడిగా ఆత్మ సంతృప్తి ఉంటుంది".

Amitabh-bachchan-is-my-inspiration-says-Allu-arjun
అల్లు అర్జున్

తెలుగు సినిమా స్థాయిని పెంచాయి...

"హిందీ సినిమాల్లో నటించాలని ఉంది. ప్రాంతాన్ని బట్టి సంప్రదాయాలు, సంస్కృతులు వేరుగా ఉన్నా, సినిమా అనేది యూనివర్సల్‌ లాంగ్వేజ్. సినిమాలో బలమైన కంటెంట్‌ ఉంటే తప్పకుండా ప్రతి గుండెను తాకుతుంది. సరైన దర్శక, నిర్మాతలు, మంచి స్క్రిప్ట్‌ ఉంటే తప్పకుండా చేస్తా. కొన్ని ఆఫర్లు వచ్చినా నా అంచనాలకు సరిపోయేలా లేవు. బహుశా అనేక విషయాలపై నేను కసరత్తులు చేయాలేమో".

మహానటి

"దశాబ్దకాలంగా చూసుకుంటే, తెలుగు సినిమా స్థాయి పెరిగింది. ఇందుకు సరైన ఉదాహరణ.. 'మహానటి'. ఇది ప్రత్యేక కమర్షియల్‌ సినిమా కాదు. కానీ, మూడు జాతీయ అవార్డులు వచ్చాయి. 'బాహుబలి' కమర్షియల్‌ చిత్రమైనా అద్భుతమైన కంటెంట్‌ ఉంది. తెలుగు సినిమా స్థాయిని పెంచిన చిత్రాలివి."

నా భార్య చాలా స్ట్రిక్ట్‌

"మహిళా అభిమానుల విషయంలో నా భార్య (స్నేహా రెడ్డి) చాలా స్ట్రిక్ట్‌గా ఉంటుంది. నా మహిళా అభిమానులు నా వైవాహిక జీవితాన్ని ఇబ్బంది పెట్టరని అనుకుంటున్నా. నాకు పెళ్లై, ఇద్దరు పిల్లలున్నారని వాళ్లకు తెలుసు. 'మీ మహిళా అభిమానులను నన్ను కలవమనండి. మీరెలా ఉంటారో చెబుతాను' అని నా భార్య అంటుంది. నా పిల్లలే కాదు, సమాజం పట్ల నాకు బాధ్యత ఉంది".

అల్లుఅర్జున్​ కుటుంబం

"నేను ఏం చేసినా, నా పిల్లలపైనే కాదు, యువతపైనా ప్రభావం చూపుతుంది. తెరపై నేను సరదాగా కనిపించినా, అది నిజ జీవితంలో అలా ప్రవర్తించను. రోజూ షూటింగ్‌ ఎలా జరిగిందో నా పిల్లలకు చెబుతా. నా సినిమాల గురించి వాళ్లకు వివరిస్తా."

సరైన వ్యక్తికి వస్తే నాకు సంతోషం

''పరుగు' చిత్రానికి నాకు తొలి ఫిల్మ్‌ఫేర్‌ వచ్చింది... నేను ఆశ్చర్యపోయా. ఆ తర్వాత 'వేదం', 'రేసుగుర్రం' చిత్రానికి ఫిల్మ్‌ఫేర్‌ రావాలని బలంగా కోరుకున్నా. అవార్డులు మంచిదే. అయితే, అవి సరైన వ్యక్తికి రావడం నాకు సంతోషాన్ని ఇస్తుంది. 'అర్జున్‌రెడ్డి'లో నటనకు గానూ విజయ్‌ దేవరకొండకు, 'జై లవకుశ'లో ఎన్టీఆర్‌కు అవార్డు రావడం నాకు చాలా ఆనందాన్ని కలిగించింది".

" స్టార్‌డమ్‌ను సొంతం చేసుకోవడం చాలా కష్టం. ఇక్కడ ఎవరి ప్రయాణం వారిది. అమితాబ్‌ బచ్చన్‌గారు నాకు స్ఫూర్తి. నాకు 70 ఏళ్లు వస్తే ఆయనలా ఉండాలని కోరుకుంటున్నా. ఆ వయసులో యువ నటులతో పనిచేయడం సరదాగా అనిపిస్తుంది. ఒక నటుడిగా దొరికే అరుదైన గౌరవం అది."

భాష రాకపోయినా నా సినిమా చూస్తారట...

"ఇటీవల కేవలం నన్ను చూసేందుకే మిడిల్‌ ఈస్ట్‌ నుంచి కొంతమంది అభిమానులు వచ్చారు. నా కోసం రెండు రోజులు వేచి చూశారు. మా వాళ్లు ఆ విషయం నాకు చెప్పగానే వారిని టీ పార్టీకి ఆహ్వానించా. వాళ్లు సేకరించిన నా ఫొటోలు, వీడియోలు చూపించారు. భాష అర్థం కాకపోయినా వాళ్లు నా సినిమాలు చూస్తారట. వాళ్లు ఈ విషయాలు చెబుతుంటే భలే అనిపించింది. ఆ అనుభూతిని ఎప్పటికీ మర్చిపోలేను"

అల్లుఅర్జున్​, అల్లు శిరీష్​

" నా సోదరుడు అల్లు శిరీష్‌కు సలహాలు ఇస్తుంటా. ఎలా మాట్లాడాలి? కొన్ని విషయాలను ఎలా వదిలేయాలి. ఏ పనైనా ఈజీగా ఎలా చేయాలి? చెబుతుంటా. అదే విధంగా వాడు నాకు కొన్ని సలహాలు ఇస్తాడు. ఏదైనా సాధించాలంటే మిమ్మల్ని మీరు నమ్ముకుని ధైర్యంగా వెళ్లడమే. కొన్నిసార్లు అది తప్పుకావచ్చు.. ఇంకొన్నిసార్లు సరైనది కావచ్చు. మన మనసు ఏది చెబితే దాన్ని ఫాలో అవడమే."

ఇదీ చూడండి.. ప్రముఖ హీరోయిన్​ను​ చంపమని నిర్మాత మెయిల్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.