ETV Bharat / sitara

బాలీవుడ్​ స్టార్ డైరెక్టర్​తో అల్లుఅర్జున్​ భేటీ.. అందుకేనా? - సంజయ్​ లీలా భన్సాలీ

Sanjay leela Bhansali Alluarjun movie: 'పుష్ప' సకెస్స్​తో జోరు మీదున్న ఐకాన్​ స్టార్​ అల్లుఅర్జున్​.. తాజాగా ముంబయిలో బాలీవుడ్​ ప్రముఖ దర్శకుడు సంజయ్​ లీలా భన్సాలీని కలిశారు. వీరిద్దరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. భవిష్యత్​లో సినిమా చేసేందుకే వీరిద్దరూ కలిశారని సినీవర్గాల టాక్​.

allu
అల్లుఅర్జున్​
author img

By

Published : Mar 15, 2022, 1:34 PM IST

Updated : Mar 15, 2022, 2:18 PM IST

Sanjay leela Bhansali Alluarjun movie: బాలీవుడ్​ ప్రముఖ దర్శకుడు సంజయ్​ లీలా భన్సాలీ-ఐకాన్​ స్టార్​ అల్లుఅర్జున్​ కలిసి సినిమా చేయబోతున్నారా? అంటే అవుననే అనుకుంటున్నారు అభిమానులు. సోమవారం ముంబయిలోని సంజయ్​ కార్యాలయంలో ఆయన్ను బన్నీ కలవడమే ఇందుకు కారణం. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్​గా మారింది. వీరిద్దరి భేటీ ప్రస్తుతం చిత్రసీమలో హాట్​టాపిక్​గా మారింది. భవిష్యత్​లో సినిమా చేసేందుకే వీరు కలిశారా? లేదా ఇంకేమైనా అయి ఉంటుందా? అని ఫ్యాన్స్​ ఆరా తీయడం ప్రారంభించారు.

కాగా, 'పుష్ప' మూవీతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించారు ఐకాన్​ స్టార్ అల్లుఅర్జున్​. 'తగ్గేదే లే' అంటూ ఒక్క డైలాగ్​తో పాన్​ ఇండియా స్టార్​గా మారిపోయారు. ఆయన మేనరిజానికి ఫ్యాన్స్​ ఫిదా అయిపోయారు. గతేడాది డిసెంబరు 17న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం సూపర్​హిట్​ను అందుకుంది. బాక్సాఫీస్​ ముందు రికార్డు స్థాయిలో కలెక్షన్లను అందుకుంది. ప్రస్తుతం బన్నీ 'పుష్ప' రెండో భాగంలో నటిస్తున్నారు. అయితే ఈ భారీ విజయంతో ఆయనకు బడా ఆఫర్లు వరుసగా క్యూ కడుతున్నాయట. ఆయన కూడా ఇకపై తన తదుపరి సినిమాలన్నీ పాన్​ ఇండియా స్థాయిలోనే రూపొందించాలని దృష్టి పెట్టారట! ఈ క్రమంలోనే బన్నీ తాజాగా ప్రముఖ బాలీవుడ్​ దర్శకుడు సంజయ్​ లీలా భన్సాలీ ని కలవడం వల్ల చిత్రసీమలో ప్రాధాన్యత సంతరించుకుంది.

సంజయ్​ లీలా భన్సాలీకి సినిమాలను రూపొందించడంలో ప్రత్యేక శైలి ఉంది. ఇటీవలే ఆయన తెరకెక్కించిన గంగూబాయ్​ కతియావాడి' ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్​హిట్​ను అందుకుంది.

ఇదీ చూడండి: ఆలియా 'బ్రహ్మాస్త్ర' గ్లింప్స్​.. 'అర్జున కళ్యాణానికి' ముహూర్తం ఫిక్స్​

Last Updated : Mar 15, 2022, 2:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.