ఓ సినిమా ముహూర్తపు వేడుకలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ను ఆ కార్యక్రమానికి వచ్చిన స్పెషల్ గెస్ట్ ముద్దాడింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
ఆ స్పెషల్ గెస్ట్ ఎవరు?
టాలీవుడ్ యువ కథానాయకుడు నిఖిల్ హీరోగా అల్లు అరవింద్ సమర్పణలో తెరకెక్కనున్న చిత్రం '18 పేజీస్'. పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమా పూజా కార్యక్రమం గురువారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ పూజా కార్యక్రమంలో చిత్రబృందంతోపాటు అల్లు అరవింద్ దంపతులు పాల్గొన్నారు. అల్లుఅర్జున్ కుమార్తె అల్లు అర్హ ప్రత్యేక అతిథిగా హాజరైంది.
కార్యక్రమం అనంతరం అల్లు అరవింద్, అల్లు అర్హ ఆత్మీయంగా మాట్లాడుకుంటూ కనిపించారు. వీరిద్దరి మధ్య సంభాషణలో అర్హ తాతయ్య అల్లు అరవింద్‌ను ముద్దాడింది. ఇదంతా వీడియోగా నిఖిల్ చిత్రీకరించాడు. "మా సినిమా ముహుర్తపు పూజా కార్యక్రమానికి స్పెషల్ గెస్ట్ అర్హ" అని నిఖిల్ వీడియోలో చెబుతూ కనిపించాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. తాత-మనవరాలు మధ్య ప్రేమ, అనురాగాలకు మురిసిపోతున్నారు. అర్హ క్యూట్, స్వీట్ అని కామెంట్లు పెడుతున్నారు.
-
Chief guest#Arha #AlluAravind Presents @actor_Nikhil 's Next titled as #18Pages pic.twitter.com/BDaAth6MnT
— ɴɪᴋʜɪʟ sɪᴅᴅʜᴀʀᴛʜᴀ ᶠᶜ (@actornikhil_fc) March 5, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Chief guest#Arha #AlluAravind Presents @actor_Nikhil 's Next titled as #18Pages pic.twitter.com/BDaAth6MnT
— ɴɪᴋʜɪʟ sɪᴅᴅʜᴀʀᴛʜᴀ ᶠᶜ (@actornikhil_fc) March 5, 2020Chief guest#Arha #AlluAravind Presents @actor_Nikhil 's Next titled as #18Pages pic.twitter.com/BDaAth6MnT
— ɴɪᴋʜɪʟ sɪᴅᴅʜᴀʀᴛʜᴀ ᶠᶜ (@actornikhil_fc) March 5, 2020
ఇదీ చూడండి : టాలీవుడ్ 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్'కు గాయం!