ETV Bharat / sitara

బన్నీ 'పుష్ప' ఆన్ ఫైర్.. కలెక్షన్స్​లో తగ్గేదే లే! - అల్లు అర్జున్ పుష్ప కేరళ కలెక్షన్లు

Pushpa Collections: అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పాన్ ఇండియా మూవీ 'పుష్ప'. ఈ చిత్రం శుక్రవారం థియేటర్లలో విడుదలైంది. ఈ నేపథ్యంలో మూవీ కలెక్షన్లు ఎలా ఉన్నాయో చూద్దాం.

Pushpa Collections, Allu Arjun Pushpa The Rise Collections, పుష్ప కలెక్షన్లు, అల్లు అర్జు పుష్ప వసూళ్లు
Pushpa Collections
author img

By

Published : Dec 18, 2021, 1:05 PM IST

Updated : Dec 18, 2021, 4:39 PM IST

Pushpa Collections: అల్లు అర్జున్, రష్మిక హీరోహీరోయిన్లుగా నటించిన 'పుష్ప' చిత్రం శుక్రవారం థియేటర్లలో విడుదలైంది. సుకుమార్ దర్శకత్వం, బన్నీ నటన, సినిమాటోగ్రఫీతో పాటు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం ఈ చిత్రానికి ప్లస్​గా మారాయి. సమంత స్పెషల్ సాంగ్ కూడా థియేటర్లకు జనాల్ని రప్పించడంలో సఫలమైంది. దీంతో తొలిరోజే కలెక్షన్ల పరంగా దుమ్మురేపిందీ చిత్రం.

నైజాం ఏరియాలో ఏకంగా తొలిరోజే 11.44 కోట్ల షేర్​తో ఆల్​టైమ్ రికార్డు సృష్టించింది 'పుష్ప'. ఈ విషయాన్ని చిత్రబృందం సామాజిక మాధ్యమాల వేదికగా అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉండటం, ఐదో షోకు పర్మిషన్, టికెట్ రేట్ల పెంపు భారీ కలెక్షన్లకు దోహదం చేశాయి.

అలాగే తమిళనాడులో తొలిరోజు ఈ చిత్రానికి 3.75 కోట్ల గ్రాస్ లభించిందని తెలుస్తోంది. కేరళలో 2.5 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. సరైన ప్రమోషన్లు లేకపోయినా ఓ డబ్బింగ్ సినిమాకు ఇంతటి కలెక్షన్లు రావడం అద్భుతమనే చెప్పవచ్చు.

బాలీవుడ్​లోనూ మంచి వసూళ్లు

అల్లు అర్జున్ 'పుష్ప'పై బాలీవుడ్​లో మంచి హైప్ ఏర్పడింది. దానికి కారణం బన్నీ నుంచి వచ్చిన చాలా చిత్రాలు యూట్యూబ్​లో దుమ్మురేపాయి. కానీ బన్నీ చిత్రాలు హిందీలో డబ్ కావడం ఇదే తొలిసారి. ప్రమోషన్స్ సరిగా లేకపోయినా, థియేటర్ల సీటింగ్ సామర్థ్యం 50 శాతమే ఉన్నా.. అక్కడ కూడా ప్రేక్షకుల్ని మెప్పించడంలో సఫలమయ్యారు సుక్కు-బన్నీ. దీంతో తొలిరోజే ఈ చిత్రానికి అక్కడ 3.1 కోట్ల వసూళ్లు రావడం విశేషం. శని, ఆదివారాల్లో ఈ కలెక్షన్లు మరింతగా పెరుగుతాయని అంచనా.

ఇవీ చూడండి: Pushpa 2 Movie: 'పుష్ప పార్ట్ 2'తో ఏం చెప్పబోతున్నారు?

Last Updated : Dec 18, 2021, 4:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.