స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ కూతురు అర్హాకు సంబంధించిన మరో వీడియో ప్రస్తుతం నెట్టింట సందడి చేస్తోంది. ఇందులో ఆ చిన్నారితో తాను చెప్పిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటావా అని బన్నీ అడగ్గా.. చేసుకోను అంటూ క్యూట్‌గా చెప్పింది అర్హా. ఈ వీడియోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసిన అర్జున్.. ఇది 374వ ప్రయత్నమని క్యాప్షన్ ఇచ్చారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
లాక్డౌన్ సమయాన్ని ఇంటిపట్టునే ఉంటూ కుటుంబంతో గడపడానికి వెచ్చిస్తిస్తున్నారు అర్జున్. తనయుడు అయాన్, తనయ అర్హాతో కాలక్షేపం చేస్తున్నారు. తరచూ వీరి వీడియోలు షేర్ చేస్తూ అభిమానులకు టచ్‌లో ఉంటున్నారు. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'పుష్ప'లో నటిస్తున్నారు బన్నీ. కరోనా కారణంగా షూటింగ్ వాయిదా పడింది.