స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ 'అల వైకుంఠపురములో' విడుదలకు సర్వం సిద్ధమైంది. రేపే(శనివారం) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంది చిత్రబృందం. అందులో ఒకదానిలో మాట్లాడిన బన్నీ.. తన స్నేహితుల గురించి ఆసక్తికర విషయం చెప్పాడు.
"ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు అప్పుడప్పుడు నా ఫ్రెండ్స్ సెట్‌కు వచ్చేవారు. ఇలాంటి స్నేహితులుంటే జీవితంలో ఇంకేమి అక్కర్లేదని అనుకొనేవాడిని. కానీ తర్వాత వారు.. బావా! మేం పూజా కోసం వచ్చాం అని చెప్పేవారు. ఈ మాటతో నేను అవాక్కయ్యా(నవ్వుతూ)" -అల్లు అర్జున్, హీరో
ఈ సినిమాలో సుశాంత్, టబు, నవదీప్, నివేదా పేతురాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. తమన్ సంగీతమందించాడు. త్రివిక్రమ్ దర్శకత్వం వహించాడు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించాయి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">