గత కొన్నేళ్లుగా పరాజయాలతో సతమతవుతోన్న హీరో అల్లరి నరేశ్. ఇటీవలే మహేశ్‌బాబు 'మహర్షి'లో కీలక పాత్రలో ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం 'బంగారు బుల్లోడు' సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పుడు కథానాయకుడిగా మరో చిత్రం ఖరారు చేశాడు.
కొత్త దర్శకుడు విజయ్ కనకమేడలకు అవకాశమిచ్చాడు నరేశ్. ఎస్వీటూ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సతీశ్ వేగేశ్న నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. త్వరలో సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించనున్నారు.
ఇది చదవండి: నాకు తొమ్మిదిసార్లు పెళ్లి చేశారు: అల్లరి నరేశ్