ETV Bharat / sitara

మా నాన్న ఉన్నా లేనట్టే: నటి శ్రీవాణి - ఆలీతో సరదాగా

ఈ వారం 'ఆలీతో సరదాగా' సెలబ్రిటీ టాక్​ షోకు బుల్లితెర నటులు శ్రీవాణి, నవ్యస్వామి విచ్చేసి పలు ఆసక్తికర విషయాలను తెలిపారు. గతంలో జరిగిన కొన్ని సందర్భాలను గుర్తుచేసుకుని భావోద్వేగానికి గురయ్యారు.

srivani
నటి శ్రీవాణి
author img

By

Published : May 19, 2021, 8:32 AM IST

తనకు తండ్రి ఉన్నారని.. అయితే ఆయన ఉన్నా లేనట్టేనని.. ఇంతవరకూ కనీసం ఒక్క డ్రెస్‌ కూడా కొనిపెట్టలేదని బుల్లితెర నటి శ్రీవాణి కన్నీళ్లు పెట్టుకుంది. మరోవైపు.. తనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయినప్పుడు తానుండే గేటెడ్‌ కమ్యూనిటీలోకి రానివ్వలేదని.. ఆ సమయంలో తనకు తోడుగా కూడా ఎవరూ లేరని.. తన జీవితంలో అంతలా ఏడ్చిన సందర్భం ఇంకోటి లేదని మరోనటి నవ్యస్వామి ఆవేదనకు గురైంది.

ఆలీ వ్యాఖ్యాతగా ప్రసారమయ్యే 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో బుల్లితెర నటులు శ్రీవాణి, నవ్యస్వామి పాల్గొని సందడి చేశారు. ఈ సందర్భంగా ఆలీ అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. శ్రీవాణిని పెళ్లి గురించి అడగ్గా.. 'మా ఆయన అడగ్గానే సీరియల్‌ను మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయాను. నేను వెళ్లిపోయిన తర్వాత నా స్థానంలో వేరే హీరోయిన్‌ పెట్టుకోకుండా సీరియల్‌ మొత్తాన్నే ఆపేశారు' అని శ్రీవాణి నవ్వుతూ బదులిచ్చింది. మధ్యలో తమ తల్లిదండ్రులను గుర్తు చేసుకొని నవ్యస్వామి తీవ్ర ఆవేదనకు గురైంది. ఈ ఎపిసోడ్ మే 24న ప్రసారం కానుంది. ప్రస్తుతానికి ఈ ప్రోమో చూసేయండి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.