తాము బయటకు వెళ్తే, తనకన్నా తన భార్యతో ఫొటోలు దిగేందుకు అభిమానులు ఎక్కువ ఆసక్తి చూపిస్తారని అంటున్నారు బుల్లితెర నటుడు జాకీ. ఆయన తన భార్య హరితతో కలిసి 'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆలీ అడిగిన కొంటె ప్రశ్నలకు జాకీ, హరిత తుంటరి సమాధానాలు ఇచ్చారు.
"ఎవరు ఎవరికి మొదట ప్రపోజ్ చేశారు" అని ఆలీ అడగ్గా.. "ఇద్దరికీ ఇద్దరం ఇష్టమని తెలుసు. అయితే, ఏమీ తెలియనట్టు నటిస్తూ ఉండేవాళ్లం. అమ్మాయిని లవ్‌లో పడేసే క్రమంలో 'ఇంట్లో నాకూ సంబంధాలు చూస్తున్నారు. నేను ఓకే చెప్పడం లేదు' ఇలా చాలా కబుర్లు చెబుతాం కదా. అలానే నేను కూడా చెప్పేవాడిని" అంటూ జాకీ నవ్వుతూ సమాధానం ఇచ్చారు. 'మన' అనుకున్నప్పుడే భార్యభర్తల మధ్య గొడవలు వస్తాయని హరిత చెప్పుకొచ్చారు. ఇలా సరదాగా సాగిపోయిన ఈ ఎపిసోడ్ చూడాలంటే జనవరి 11వ తేదీ వరకూ వేచి చూడాల్సిందే.
- " class="align-text-top noRightClick twitterSection" data="">