ETV Bharat / sitara

ఆలియా 'బ్రహ్మాస్త్ర' గ్లింప్స్​.. 'అర్జున కళ్యాణానికి' ముహూర్తం ఫిక్స్​ - విశ్వక్​ సేన్​ అశోకవనంలో అర్జున కల్యాణం

కొత్త సినిమా అప్డేట్స్​ వచ్చాయి. ఇందులో ఆలియాభట్​, విశ్వక్​ సేన్​, వరుణ్​ చిత్రాల సంగతులు ఉన్నాయి. అవేంటో చూద్దాం..

alia
ఆలియా
author img

By

Published : Mar 15, 2022, 12:19 PM IST

Updated : Mar 15, 2022, 1:05 PM IST

Aliabhatt Bramhastra: అందం, చలాకీతనం, నటనతో యూత్​లో ఫుల్​ క్రేజ్​ సంపాదించుకుంది నటి ఆలియాభట్​. త్వరలోనే 'ఆర్​ఆర్​ఆర్​'తో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ భామ.. ప్రస్తుతం పలు భారీ ప్రాజెక్ట్​ల్లో నటిస్తూ బిజీగా ఉంది. నేడు ఈ ముద్దుగుమ్మ పుట్టినరోజు సందర్భంగా భారీ స్థాయిలో తెరకెక్కుతున్న 'బ్రహ్మాస్త్ర' సినిమాలోని తన పాత్రకు సంబంధించిన గ్లింప్స్​ను రిలీజ్​ చేసింది చిత్రబృందం. ఆమె పాత్ర పేరు ఇషాగా పరిచయం చేసింది. ఈ వీడియోలోని రిచ్​ విజువల్స్​ ఆకట్టుకునేలా ఉన్నాయి. ముఖ్యంగా ఆలియా పలికించిన హావాభావాలు సూపర్​గా ఉన్నాయి.

దాదాపు ఏడేళ్ల క్రితమే ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్​లో రణ్​బీర్​ కపూర్​ హీరోగా నటిస్తున్నారు. అమితాబ్​ బచ్చన్, అక్కినేని నాగార్జున, మౌనీ రాయ్​లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. 2022 సెప్టెంబరు 9న.. హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రం మొదటి భాగం విడుదలకానుంది. చిత్రాన్ని ఫాక్స్​ స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్​, ప్రైమ్ ఫోకస్, స్టార్​లైట్​ పిక్చర్స్​ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

'అర్జున కళ్యాణానికి' ముహూర్తం ఫిక్స్​

ViswakSen Ashokavanmlo Arjunakalyanam: టాలీవుడ్‌ యంగ్‌ అండ్​ మాస్​ హీరో విశ్వక్‌ సేన్‌ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం '‘అశోకవనంలో అర్జున కళ్యాణం' రిలీజ్​ డేట్​ను ఖరారు చేసుకుంది. ఏప్రిల్ 22న థియేటర్లలో విడుదల కానుంది. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి విద్యా సాగర్ చింతా దర్శకత్వం వహిస్తున్నారు. కథ, స్క్రీన్‌ప్లే, డైలాగులు రాజు వారు రాణి వారు ఫేమ్ రవికిరణ్ కోలా అందిస్తూ ఉండగా సంగీతం జై క్రిష్ అందిస్తున్నారు. ఈ సినిమాలో విశ్వక్‌ వడ్డీ వ్యాపారి అర్జున్‌ కుమార్‌ పాత్రలో నటిస్తున్నారు. ఫస్ట్‌లుక్‌ చాలా డిఫరెంట్‌గా ఉంది. హీరో పెళ్లి కోసం పడే తంటాలతో ఈ సినిమా సాగనుంది. ఈ సినిమాలో విశ్వక్ కు జంటగా రుక్సార్ థిల్లాన్ నటిస్తోంది. ప్రముఖ నిర్మాత బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ సమర్పణలో, ఎస్‌విసిసి డిజిటల్ బ్యానర్ మీద ఆయన తనయుడు బాపినీడు, సుధీర్ ఈదరతో కలిసి ఈ మూవీని నిర్మిస్తున్నారు.

'గని' ట్రైలర్​కు టైమ్​ పిక్స్​

Varun tej Gani trailer: మెగాహీరో వరుణ్​తేజ్​ కథానాయకుడిగా నటించిన చిత్రం 'గని'. ఇందులో వరుణ్​బాక్సర్‌గా కనిపించారు. సయీ మంజ్రేకర్‌ కథానాయిక. తాజాగా ఈ సినిమా ట్రైలర్​ విడుదల తేదీని తెలియజేసింది చిత్రబృందం. మార్చి 17న ఉదయం 10:30 గంటలకు రిలీజ్​ చేయనున్నట్లు తెలిపింది. ఈ సినిమాకు కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్నారు. అల్లు బాబీ, సిద్ధు ముద్ద సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అల్లు అరవింద్‌ సమర్పకులు. జగపతిబాబు, సునీల్‌ శెట్టి, ఉపేంద్ర, నవీన్‌చంద్ర ఇతర కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి తమన్‌ సంగీతమందించారు.

ఇదీ చూడండి: 'రాధేశ్యామ్'​ ఓటీటీలోకి అప్పుడే.. డైరెక్టర్​ రాధాకృష్ణ ట్వీట్​ వైరల్​!

Last Updated : Mar 15, 2022, 1:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.