ETV Bharat / sitara

మతం మార్చుకున్న డైరెక్టర్.. ఆ విషయమే కారణం? - cinema news

ఓ విషయమై తెగ బాధపడిన మలయాళ డైరెక్టర్ అలీ అక్బర్.. ఇస్లాం మతాన్ని విడిచిపెట్టి హిందువుగా మారారు. ఇంతకీ ఏం జరిగిదంటే?

Malayalam film director Ali Akbar
మలయాళ డైరెక్టర్ అక్బర్ అలీ
author img

By

Published : Dec 11, 2021, 8:53 PM IST

మలయాళ ప్రముఖ దర్శకుడు అలీ అక్బర్ మతం మార్చుకున్నారు. ఇస్లాం మతాన్ని విడిచి హిందువుగా మారానని, తన పేరును రామసింహంగా చేసుకున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని ఫేస్​బుక్ లైవ్​లో వెల్లడించారు. అలానే తన కుటుంబం మొత్తం ఇప్పటినుంచి భారతీయ సంప్రదాయాలను పాటిస్తామని అన్నారు.

ఏం జరిగింది?

సీడీఎస్​ బిపిన్​ రావత్​.. ఇటీవల హెలికాప్టర్​ ప్రమాదంలో మరణించారు. ఇదే విషయమై ఈ డైరెక్టర్​ ఫేస్​బుక్​లో పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్​కు స్మైల్​ ఏమోజీని కామెంట్​ రూపంలో పెట్టారు ఓ నెటిజన్​. ఇది తన మనసుకు ఎంతో బాధపెట్టిందని ఈ దర్శకుడు చెప్పారు.

అయితే ఏమోజీ విషయమై తాను స్పందించిన ఐదు నిమిషాలకే ఫేస్​బుక్, తన ఖాతాను 30 రోజులు బ్లాక్​ చేసిందని రామసింహం(పాత పేరు అలీ అక్బర్) పేర్కొన్నారు. తాను దీనిని సహించలేకపోయానని, అందుకే ఇస్లాంను విడిచిపెట్టానని అన్నారు. ఇక నుంచి తన కుటుంబం ముస్లిం కాదని భారతీయులం అని చెప్పారు.

ప్రస్తుతం అలీ అక్బర్ అలియాస్ రామసింహం.. వరియన్ కున్నత్తు అహ్మద్ హజీ జీవితాన్ని సినిమాగా తెరకెక్కిస్తున్నారు. దీనిని క్రౌడ్ ఫండింగ్ ద్వారా నిర్మిస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.