ETV Bharat / sitara

సినీడైరీ: ధోనిలా అక్షయ్​ను ఊహించగలమా..? - sushanth singh rajput

మహేంద్ర సింగ్​ ధోని బయోపిక్​లో నటించేందుకు ముందు అక్షయ్ కుమార్ ఆసక్తి చూపించాడంట. అయితే ధోనికి, అక్షయ్​కు పోలికలు లేని కారణంగా దర్శకుడు నీరజ్ పాండే ఆ స్థానంలో సుశాంత్​కు అవకాశమిచ్చాడట.

ధోని
author img

By

Published : Jul 21, 2019, 12:24 PM IST

కెప్టెన్​ కూల్ మహేంద్ర సింగ్​ ధోని జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం 'ఎమ్​ఎస్​ ధోని: ద అన్​టోల్డ్ స్టోరీ'. ఇందులో మహీ పాత్రలో సుశాంత్​సింగ్ రాజ్​పుత్ సరిగ్గా ఒదిగిపోయాడు. ధోనినే సినిమాలో నటించాడా అనుకునేంత మాయ చేశాడు. మరి సుశాంత్​ స్థానంలో మరో హీరోను ఊహించగలమా.. అందులో అక్షయ్ కుమార్​ను సరిపోల్చుకోగలమా? ఈ సినిమాకు, అక్షయ్​కు సంబంధం ఏంటి అనుకుంటున్నారా?

ధోని బయోపిక్​లో నటించేందుకు ముందు అక్షయ్​ కుమార్ ఆసక్తి చూపించాడంట. ఈ విషయాన్ని దర్శకుడు నీరజ్ పాండేకూ చెప్పాడంట. అయితే ధోని, అక్షయ్​కు పోలికలు లేని కారణంగా మర్యాదపూర్వకంగా బాలీవుడ్ కిలాడీని తిరస్కరించాడంట దర్శకుడు. అలా అవకాశం సుశాంత్​కు దక్కింది.

సుశాంత్ కెరీర్​లో ధోని చిత్రం అతి పెద్ద విజయం సాధించింది. 2016లో వచ్చిన ఈ సినిమాలో కియరా అడ్వాణి హీరోయిన్​గా నటించింది. హిందీతో పాటు తెలుగు, తమిళంలో అనువాదమై అక్కడ కూడా ఘనవిజయం సాధించింది మహీ బయోపిక్.

ఇది చదవండి: 'నిజ జీవిత పాత్రల్లా ప్రజలు ఆదరిస్తున్నారు'

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.

Copyright 2013 CCTV. All rights reserved.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.