మహారాష్ట్రలో చిత్రీకరణలకు అనుమతినిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే ప్రకటన చేసింది. కంటైన్మెంట్ జోన్లు మినహాయించి మిగిలిన ప్రాంతాల్లో టీవీ, సినిమాలకు సంబంధించిన షూటింగ్‌లు చేసుకోవచ్చని తెలిపింది. ఈ క్రమంలో షూటింగ్‌లను పునఃప్రారంభించే వారిలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ముందున్నారు.
అక్షయ్.. ప్రస్తుతం నటిస్తున్న 'బెల్ బాటమ్' చిత్రీకరణను జులై నుంచి లండన్‌లో ప్రారంభించనున్నారని సమాచారం. దీనికి సంబంధించిన ముందస్తు ప్రణాళికను ఆ చిత్రబృందం సిద్ధం చేస్తుందట. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా షూటింగ్‌ను జరపనున్నారని తెలుస్తోంది. బాలీవుడ్ వర్గాల సమాచారం మేరకు జులై నుంచి లండన్‌లో షూటింగ్ ప్రారంభిచనున్నారు. ఈ సినిమాకు రంజిత్ తివారి దర్శకత్వం వహించగా.. నిఖిల్ అడ్వాణీ, వషు భగ్నాని నిర్మిస్తున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
అత్యధికంగా ఆర్జిస్తున్న నటుడు
ఈ ఏడాది అత్యధికంగా సంపాదించిన సెలబ్రెటీల్లో టాప్ 100లో చోటు సాధించారు నటుడు అక్షయ్ కుమార్. దాదాపు రూ.366 కోట్లతో బాలీవుడ్లో ఎక్కువ ఆర్జిస్తున్న హీరోగా జాబితో చోటు సంపాదించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న జాబితాలో అక్షయ్ 52వ స్థానాన్ని దక్కించుకోగా.. హాలీవుడ్ స్టార్ నటులు విల్ స్మిత్ 69, ఏంజెలీనా జోలీ 99వ ర్యాంక్‌లో ఉన్నారు.
అక్షయ్ నటించిన 'కేసరి', 'మిషన్ మంగళ్', 'హౌస్ ఫుల్ 4', 'గుడ్ న్యూస్' సినిమాలు గతేడాది విడుదలై బాక్సాఫీస్ వద్ద ఘనవిజయాన్ని సాధించాయి. ఆయన ప్రస్తుతం 'లక్ష్మీ బాంబ్', 'సూర్య వంశీ', 'పృథ్వీరాజ్', 'అత్రాంగి రే' చిత్రాల్లో నటిస్తున్నారు.
ఇదీ చూడండి... పెంగ్విన్ టీజర్: కుమారుడి ఆచూకీ కోసం ఓ తల్లి వేదన