బాలీవుడ్‌లో అగ్ర కథానాయకుడిగా రాణిస్తున్న అక్షయ్ కుమార్.. ఒకప్పుడు రెస్టారెంట్‌లో వెయిటర్‌గా పనిచేశారు. కోట్ల రూపాయలు సంపాదిస్తూ ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కించుకున్న ఆయన.. సినీ కెరీర్ ఆరంభించడానికి ముందు డబ్బుల కోసం ఎన్నో ఉద్యోగాలు చేశారు. ఇదే విషయాన్ని అక్షయ్ తాజాగా గుర్తు చేసుకున్నారు. ఆయన ఇటీవల సాహస వీరుడు బేర్ గ్రిల్స్‌తో కలిసి 'ఇన్ టు ది వైల్డ్' షో కోసం సాహసాలు చేసిన సంగతి తెలిసిందే.
కర్ణాటకలోని బందిపూర్ టైగర్ రిజర్వ్‌లో ఈ షూట్ జరిగింది. ఈ క్రమంలో అక్షయ్ తన జీవితంలోని పలు సందర్భాల్ని గుర్తు చేసుకున్నారు.
"థాయిలాండ్‌లో వెయిటర్‌గా పనిచేస్తున్న రోజుల్లో చాలా స్వేచ్ఛగా ఉండేవాడిని. ఇప్పుడు నాకు కావాల్సినంత డబ్బు ఉంది. కానీ అప్పట్లో జీవితం పూర్తిగా వేరు. ఎంతో స్వేచ్ఛగా జీవించేవాడిని. ఓసారి ఓ మహిళ నాకు టిప్పుగా ముద్దుపెట్టింది"
-- అక్షయ్ కుమార్, బాలీవుడ్ హీరో
అనంతరం మోడలింగ్‌లోకి రావడం గురించి ప్రస్తావిస్తూ.. "నేను మార్షల్ ఆర్ట్స్ టీచర్‌గా ఉన్నప్పుడు అనుకోకుండా మోడలింగ్‌లోకి అడుగుపెట్టా. నా దగ్గర శిక్షణ తీసుకుంటున్న ఓ అబ్బాయి తండ్రి మోడలింగ్ షూట్‌కి వెళ్లమని నాకు సలహా ఇచ్చారు. డబ్బులు వస్తాయని నేనూ వెళ్లా. రెండు గంటల షూట్‌కు రూ.21 వేల చెక్ ఇచ్చారు. నిజంగా అద్భుతంగా అనిపించింది. నేను నెలంతా కష్టపడి పిల్లలకి శిక్షణ ఇచ్చినా రూ.5వేలు మాత్రమే వస్తుంది. అలాంటిది రెండు గంటల వ్యవధిలో ఇంత సంపాదించడం ఆనందంగా అనిపించింది. ఆపై నటుడిగా మారా.." అని అక్షయ్ చెప్పుకొచ్చారు. గతంలో ఈ షోలో ప్రధాని నరేంద్ర మోదీ, తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ పాల్గొన్న విషయం తెలిసిందే. శుక్రవారం నుంచి అక్షయ్ ఎపిసోడ్ డిస్కవరీ ప్లస్ యాప్‌లో అందుబాటులోకి వచ్చింది.
'గుడ్ న్యూస్' తర్వాత అక్షయ్ 'సూర్యవంశీ'లో నటించారు. కొవిడ్-19 కారణంగా ఈ చిత్రం విడుదల వాయిదా పడింది. ఆయన నటించిన 'లక్ష్మీ బాంబ్' సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకొంటోంది. అక్షయ్ చేతిలో ప్రస్తుతం 'పృథ్వీరాజ్', 'బెల్ బాటమ్' తదితర చిత్రాలు ఉన్నాయి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">