ETV Bharat / sitara

'బెల్​బాటమ్​' కోసం అక్షయ్ 18 ఏళ్ల రూల్​ బ్రేక్​ - బెల్​ బాటమ్ కోసం 18 ఏళ్ల నియమాన్ని పక్కన పెట్టిన అక్షయ్​

'బెల్​ బాటమ్​' కోసం హీరో అక్షయ్ కుమార్.. గత కొన్నేళ్లుగా తను ఆచరిస్తున్న రూల్​ను బ్రేక్​ చేశారట. రోజుకు రెండు షిఫ్టుల్లో పని చేస్తున్నారని సమాచారం.

Akshay Kumar breaks his 18-year-old rule for Bell Bottom
ఆ సినిమా కోసం 18 ఏళ్ల నియమాన్ని పక్కన పెట్టిన అక్షయ్​
author img

By

Published : Sep 21, 2020, 4:55 PM IST

రోజుకు ఎనిమిది గంటలే పని చేయాలన్న నియమాన్ని బాలీవుడ్​ నటుడు అక్షయ్​ కుమార్ పెట్టుకున్నారు. ఆయన నటిస్తున్న 'బెల్​ బాటమ్​' కోసం మాత్రం గత 18 ఏళ్లుగా ఉన్నదాన్ని పక్కన పెట్టారట. షూటింగ్​ కోసం రోజుకు రెండు షిఫ్టుల్లో పని చేస్తున్నారని, చిత్రబృందం అలానే పనిచేయాలని సూచించినట్లు సమాచారం.

18 ఏళ్ల నియమాన్ని పక్కన పెట్టి

స్కాట్లాండ్​లోని అందమైన కొండల్లో 'బెల్​ బాటమ్' చిత్రీకరణ జరుగుతోంది. లాక్​డౌన్​ తర్వాత విదేశాల్లో షూటింగ్ జరుగుతున్న తొలి బాలీవుడ్ చిత్రంగానూ నిలిచింది. అక్కడికి చేరుకున్న తర్వాత 14 రోజుల పాటు నిర్బంధంలో తమ విలువైన సమయాన్ని కోల్పోవడం సహా నిర్మాతలపై వ్యయభారం పెరుగుతుందని భావించిన అక్షయ్.. 18 ఏళ్లుగా తాను పాటిస్తున్న నియమాన్ని పక్కన పెట్టాలని నిర్ణయించుకున్నారట.

డబ్బు, సమయం ఆదా

'బెల్​ బాటమ్' కోసం రోజుకు రెండు షిఫ్టుల్లో పనిచేయాలన్న అక్షయ్​ సూచన చిత్రబృందాన్ని ఆశ్చర్యపరిచిందట. ఈ విధంగా నిర్మాతల డబ్బు ఆదా చేయొచ్చని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది.

స్పై-థ్రిల్లర్​ కథతో రూపొందిస్తున్న 'బెల్​ బాటమ్'కు రంజిత్​ ఎమ్ తివారీ దర్శకత్వం వహిస్తున్నారు. వాణీ కపూర్, హ్యుమా ఖురేషీ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.