ETV Bharat / sitara

Bell Bottom: అక్షయ్​ సినిమా రిలీజ్​ డేట్​ ఫిక్స్​ - అక్షయ్​కుమార్​ బెల్​బాటమ్​ రిలీజ్​

'బెల్​ బాటమ్' సినిమా​ థియేటర్లోనే విడుదలవుతుందని స్పష్టం చేసారు బాలీవుడ్​ స్టార్​ హీరో అక్షయ్​కుమార్​. జులై 27న ప్రేక్షకుల ముందుకు వస్తుందని చెప్పారు.

akshay
అక్షయ్​
author img

By

Published : Jun 15, 2021, 1:58 PM IST

ఎప్పుడెప్పుడా అని ప్రేక్ష‌కులు ఆస‌క్తిగా ఎదురుచూస్తోన్న చిత్రం 'బెల్ బాట‌మ్'(bell bottom). అక్ష‌య్ కుమార్(Akshay Kumar) హీరోగా రంజిత్ ఎం.తివారీ తెర‌కెక్కించిన చిత్రమిది. కొవిడ్ సెకండ్ వేవ్ దృష్ట్యా థియేటర్లు తాత్కాలికంగా మూత‌ప‌డ‌టం వల్ల ఈ చిత్రం డిజిటల్ మాధ్య‌మం వేదిక‌గా విడుద‌ల‌వుతుందంటూ ప్ర‌చారం సాగింది. ప్ర‌ముఖ ఓటీటీలో ఈ సినిమా ప్ర‌సారం కానుందంటూ క‌థ‌నాలు వెలువ‌డ్డాయి. తాజాగా వాట‌న్నింటికీ స‌మాధానం ఇచ్చారు అక్ష‌య్. ఈ చిత్రాన్ని థియేట‌ర్లలోనే విడుద‌ల చేస్తున్న‌ట్టు సామాజిక మాధ్య‌మాల వేదిక‌గా ప్ర‌క‌టించారు. జులై 27న ప్రేక్ష‌కుల ముందుకు రానునట్లు తెలిపారు.

వాణీ క‌పూర్‌, హ్యూమా ఖురేషీ, లారా దత్తా త‌దితరులు కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు. పూజ ఎంట‌ర్‌టైన్మెంట్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం 2021 ఏప్రిల్ 2న విడుద‌ల కావాల్సి ఉంది.

ఇదీ చూడండి: Raksha bandhan: మరోసారి జోడీగా అక్షయ్​, భూమి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.